||విన్నపాఠం అబద్దం||

అలా బొట్టుపెట్టిన వేలుతోనే
ముక్కు మీన్నుంచి కొంచెం కళ్ళద్దాలు జరిపీ,
శ్వాసాగిపోడం చావుకాదంటూ తెలిసిన తీర్పు చెప్పుకుంటూ
గతాన్ని ఊకొడతాడతను.
ఒంట్లో బాలేకపొతే బార్లీనీళ్లు కాచిచ్చిన భార్యను తల్చుకుంటూ
వెలిగించుకున్న సిగరెట్ మరిచి కునుకుపట్టి వేళ్లు తగల్బడీ నిద్రలేస్తాడు .
అదేమీ విచిత్రం అనిపించదు నాకు.
కానీ, చిన్నప్పుడు చదూకున్నట్టు మనుషుల్లో అనగనగా ఒక హ్రుదయమూ అందులో నాలుగు గదులూ ఉన్నమాట నిజమైతే కావచ్చు.
ఎప్పుడూ అక్కడ రక్తమే ప్రవహించట్లేదు.నేను విన్నపాఠం అబద్దం అనిపించేలా రాత్రంతా అతను ఏడుస్తున్నాడు....

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు