పోస్ట్‌లు

March, 2017లోని పోస్ట్‌లను చూపుతోంది

F1.

కొంత సేపటికి ముందు.
"స్నానానికెళ్లినట్టున్నావ్" ఫోన్ తీసుకోలేదు.

కొంత సేపటి తర్వాత
స్నానం చేస్తూ, నన్ను అర్ధం చేసుకున్నావో, అలవాటు చేసుకున్నావో
ఆలోచిస్తూ
తలపై నుంచి పోసుకున్ననీళ్లలో కలిసి ఇంకా ఇంకా కిందకి జారిపోతాను.
నీ ఒళ్లోకి, అక్కన్నుంచి సగం కలిపి నువ్వొదిలేసిన చద్దన్నం గిన్నెలోకి
అక్కన్నుంచి కొంచెం లేటుగానైనా నువ్వు కొనిచ్చిన ప్రతీ వస్తువులోకి
దూరిపోతాను.

మరికొంత సేపటి తర్వాత
మళ్లీ నీకు ఫోన్ చేసి, "ఇందాక ఏం చెప్పాలో తెలీక ఫోన్ కావాలని తీసుకోలే"దంటాను.
నువ్వేమో తెలుసులే అని కూడా అనవు. నిజంగా నవ్వుతావు
మా చిన్నిప్పుడు నువు చాలా మందికి చెప్పిన "కొంచెం ఇబ్బందుంది ఇంకొక్కరోజాగు" అన్న మాటలా ఇప్పుడు నేను
ఓ ఐదారు నిమిషాలు నిజంగా బతగ్గలిగితే చాలు నాన్నా .

7

విరుద్దం ధర్మం కూడా

ఒకరి ఉనికి నిరూపించుకోడానికి, మరొకరం అవసరం
నేను చీకటినే , మంచోన్ని కాదు
నువు దీపానివని పూర్తిగా తెలిపేది నేను మాత్రమేననీ చెప్పను.

దేనైనా స్వాగతించడం జ్ఞానమో కాదో తెలీదుగానీ
దేనైనా ఇష్టపడ్డం ఖచ్చితంగా ప్రేమే

నా బుధ్ది విరుద్దమైనట్టూ, నీ లెక్కలూ అంతే
విరుద్దం ఇరువురి దర్మం కూడా.

6

చిల్లరలేకిచ్చిన చాక్లెట్ లోని ముక్క, చెరోగ్లాసు చెరుకురసమూ అన్నీ గుర్తుంటాయ్

ఏమిస్తావనో

ఏం కావాలనే ఒకన్నొకళ్లు అడిగింది

ఒకే ఉద్దేశ్యం.సమయంమ్మీద

అటూ ఇటూ దిగి ఇద్దరం వెంటనే వేరైరావడం

గుర్తుండి

అన్నీ తెలిసిన ఆత్మకి లొంగడం బాగున్నా, అదీ భాదేననిపిస్తుంది.బాధలైతే మరీ గుర్తుంటాయ్.

1

చేయి జరపు

ఫోర్హెడ్ టూ ఫీట్ దాకా ముద్దాడి
అడిగిందానికి
ఆకాశం భూమీ నువ్వేనని వాడిన పదమే వాడతాను

హద్దుమీరే హద్దుమీద
మన చర్చ జరిగాక
నా పరిధి నీకూ, నీ ఉనికి నాకు తెలస్తూనే వుంటుంది.

ఈ సారి ఫోర్హెడ్ టూ ప్రాణం దాకా ముద్దాడాలి
చేయి తీయకు

2

ఓయ్ కళ్లలోకి రాకు

చేతికి తెలీని గడ్డం గరుకు
చాతికి తెలిసిన రోజు
ఆగీ ఆగీ నువొదిలే గోరు వెచ్చని గాలిని
ప్రాణం రూపుకి మార్చుదాం రా

పీల్చిమరీ వాసన చూసిన
మన మొదటి చెమట చుక్కని
దు:ఖమూ, సుఖమై పారి
జీవనదిని చేద్దాం

ఏయ్ కళ్లలోంచి పోకు

3

వస్తున్నావా
ఒక గట్టునుంచి మరోగట్టుకి దూకుతూనే
వెనుతిరిగి చూడాలి

నడుస్తూ కూసేపు
ఇదంతా నీకు కొత్తే కదా
ఇంతకు ముందెప్పుడూ చూసుండవు
పచ్చదనం కోసం, ప్రకృతి కోసం నువ్వు
ప్రశ్నలకి నా భీతి నాది.

కొత్తే, చూడలేదు
వస్తున్నాను
వెచ్చదనం, వికృతిలో
నేను కొంచెం ముందున్న మాలంగా

వెనుతిరిగి చూడాలి
ఒక గట్టునుంచి మరోగట్టుకి దూకుతూనే
వస్తావా లేదా అని

||విన్నపాఠం అబద్దం||

అలా బొట్టుపెట్టిన వేలుతోనే
ముక్కు మీన్నుంచి కొంచెం కళ్ళద్దాలు జరిపీ,
శ్వాసాగిపోడం చావుకాదంటూ తెలిసిన తీర్పు చెప్పుకుంటూ
గతాన్ని ఊకొడతాడతను.
ఒంట్లో బాలేకపొతే బార్లీనీళ్లు కాచిచ్చిన భార్యను తల్చుకుంటూ
వెలిగించుకున్న సిగరెట్ మరిచి కునుకుపట్టి వేళ్లు తగల్బడీ నిద్రలేస్తాడు .
అదేమీ విచిత్రం అనిపించదు నాకు.
కానీ, చిన్నప్పుడు చదూకున్నట్టు మనుషుల్లో అనగనగా ఒక హ్రుదయమూ అందులో నాలుగు గదులూ ఉన్నమాట నిజమైతే కావచ్చు.
ఎప్పుడూ అక్కడ రక్తమే ప్రవహించట్లేదు.నేను విన్నపాఠం అబద్దం అనిపించేలా రాత్రంతా అతను ఏడుస్తున్నాడు....

||outing ||

పాదాలు రాళ్లపై రుద్దుకుంటూ , కుంకుడుపువ్వు రాసుకున్నందుకూ, రేగుముళ్లు గీసుకున్నందుకూ చర్చించుకుంటాం
నడిస్తే నడుస్తూ, అరిస్తే అలుస్తూ, సాయంత్రానికి ఇంటికెలిపోతామనే ధైర్యాన్ని ఎండ ఎంతుందో చూసి నిర్దారించుకుంటూ
చక్కిళ్లను చూస్తూ నేనూ, చేతుల్ని వెలేస్తూ నువ్వూ సాగిపోతాం

అంతా సొంతమనుకునే నా అడివిబుధ్దిని నీ స్ఖలించే కళ్లు క్షమిస్తాయని తెలుసు
ఔటింగ్ అంటే నాతో బయటకి రావడమనుకున్నాను.
నాలోపలికి పోవడమని నువు చెప్పావ్.
పాదాలు రాళ్లపై రుద్దుకుంటూ

5

నీలో నేను తేలిపోతాను
నాపై నువ్వు జారిపో
మనమంటే ఇంతే
నిలవని నీటిబొట్టూ, నిండా మునగని తామరాకు.

ఒకే లోతులో ఇద్దరం ఉన్నాం
రేగిన అలలకే చలిస్తూ, నిచ్చలంగా ఉందాం