||వానాకాలం||

కొన్ని చినుకులూ కొంత వాన, చెదిరిపోతున్న చూరులో పిచ్చుకలు చూసాక
వాటి అరుపులకు అల్లాడిపోయే దానిపేరు మా అక్క.

పుస్తకం చింపి పడవచేసిన తమ్ముణ్ణి కొట్టే నాకు
రేపు వరదొస్తే, చెరువు గండికాడ చేపలు పట్టాలనే కల.

పుల్లలు దాచుకునే అమ్మకి
గేదెల్ని లోపల కట్టేసే నాన్నాకీ ఎప్పుడన్నా బయమేసిందో లేదో గానీ
మట్టిపొయ్యి తడిసి అంటుకోక మా అమ్మ పడే యాతనే మా అందరి వానాకాలం

Comments

  1. nice
    hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support
    https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. hi, nice article. pls give me your support
    We started our new youtube channel TELUGU CINE FOCUS. Please subscribe https://goo.gl/SnE8Li

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కనీసం

F1.

షేరాటో