పోస్ట్‌లు

September, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది
1.
బతుకుతూ బతుకుతూ కనీసం ఒక్కసారైనా నిజం చెప్తామని నమ్మే దైర్యం ముందు ఆత్మకీ అసౌకర్యముంటుందని తెలిసీ, సగం గాయం చేసుకునీ కుట్లేసుకునీ, కుదుటపడీ భవిష్యత్ మీదకి పోదాం పద.

ఇంతకుముందు కూచున్న చోటులో మళ్ళీ కూచోవల్సివస్తే, ఒక బాధో సంతోషమో తప్పకుండా సొంతమవ్వాలి. పాపం తాలూకా ప్రేమనుకున్నదాన్నీ, కొద్దిగా పుణ్యం లెక్కలోకొచ్చే అమాయకత్వాన్నీ తడిమీ తడిమీ పట్టుకుందాం . జరిగిందే జరిగింది. జరిగిందే జరుగుతుంది. జరిగిందే జరగాల్సిఉంది. జీవితం ఇంతకుముందు కూడా అందరికీ ఇంతే అనేదాకా పోదాం
2.
చదివిన బల్లోనుంచి మాసినబట్టలు ఉతుక్కోకుండానే, తిరిగిన ఊళ్ళోనుంచి వొచ్చిపడ్డ యవ్వనాన్ని దాటకుండానే, భవిష్యత్ మీదకి ఎదిగిపోదాం పద. ఆరుద్రపురుగు అమ్మకి పుట్టినట్టు అందమైన రంగేదో నీలో ఉందని తెలీదు. అగరొత్తి కొనరంగు బొట్టుబిళ్ళతో మెరుస్తూ, రుతువుకి తగ్గ రంగుతో కనబడీ. . ముదురుమోదుగు తనువుతో ఈ అడివినిండిన హృదయం ముందు అంతలా పూసినందుకు అది పాపమని నీకు తెలీనందుకూ నాలో రంగుల్ని రేపెవరకూ పోదాం


3.పొగడ్డం పరిపాటేనని ప్రపంచానికి తెలిసినా, పుప్పొడిరాసుకు తిరిగే పువ్వులాగున్నావనీ మైనంలానే మెరుస్తున్నావనీ, అదనీ ఇదనీ అసౌకర్యం అంచున నిన్న…