Skip to main content

అలగ్ అలగ్
రాసే అలవాటు గురుంచి ఒకడితర్వాతొకడు అడిగీ అడిగీ ఈ మధ్య అడల్టరీ రాస్తున్నవెందుకురా అన్నారు? “అద్దరాత్రి తొడలమధ్యంటుకున్న వేజిలిన్ జిడ్డులాంటివిరా కొన్ని అలవాట్లు. కడిగేసుకుందామంటే ఒకసారితో వొదిలిపోవన్నాను” మళ్ళీ నోరుతెరిస్తే నారాయణ మంత్రంరా బాబూ! ఛీ ఛీ అన్నారు మూకుమ్మడిగా. అప్పుడప్పుడెల్లి ఉచ్చపోసుకునొస్తున్నప్పటికీ. ఐదారుగంటలు ఉగ్గబట్టుకు కుచ్చున్నందుకు నలుగురూ తాగిందానికి ఆడొక్కడే బిల్లు కట్టాడు. నిన్నా మొన్నా చేతిలో రూపాయ్ లేదు కదా! ఇవ్వాళ ఇదేంట్రా నాయనా అన్న ఫీలింగ్ ని పర్స్లోకి తోసేస్తూ ఓ రెండొందలు బయటకు తీసి ఓ యాభై మందు సెర్వ్ చేస్తున్న పిల్లాడికిస్తుంటే వాడస్సలు తీసుకోలేదు. మారేషంలో వొచ్చిన కుబేరుడి కొడుకేమో అని మనసులో అంకుంటా “పోన్లే ఓ యాభై మిగిల్చావు తమ్ముడూ అని పైకన్నాను “. నవ్వుకుంటూ “విజిటెగైన్ సార్ ” అన్నాడు. మావి మళ్ళీవొచ్చే మోకాళ్లా ఆ పిల్లాడికి కనిపించుండవు. ఆ మాటే అతనితో అని “ఈసారి మేం మళ్ళీ ఈ బారుకొస్తే , సార్ కాదు అన్నయ్యా అను’ చాలన్నాను. “ యూ ఆర్ మోస్ట్ వెల్కం” అన్నాడు. అది మూసుకుని దొబ్బేయ్రా అన్నట్టు వినిపించింది. మళ్ళీ వాడి మొఖం చూశాను. నవ్వాడు, అందులో ఆ నవ్వులో ఇక దయచేయండిరా దరిద్రులారా అన్నంత వినయం కొట్టొచ్చినట్టూ, కొట్టినట్టూ కనపడింది. రెస్పెక్ట్ కోరుకోవడం ఒకానొక ఇన్సెక్యూర్డ్ ఫీలింగయ్యుండొచ్చాఅనుకుంటా మెట్లు దిగాను. బాబాయ్ కి తప్పదు భారీ మూల్యం అనేలాగా కిందకొచ్చాక మాలోవొకడు తీసుకురమ్మన్న సిగరెట్ పేకెట్ి్ నూటపదిరూపాయలు నోక్కెశాడు ఆ పాన్ షాపోడు. నా కొడకళ్ళారా మందు ఎలాగూ మానరు కదరా! ఈ సిగరెట్ తాగకపోతే చస్తారా అని తిట్టుకుంటూ తొంబైరూపాయలు బద్రంగా దాచుకున్నాను.
రేపు సెలవేకదా ఆపీసులు కూడాలేవు పరిమిగాడి రూమ్కి పోదాంరా అన్నాను. అంతా సరే అన్నారు. ఆటో అగాక అందరం మెట్లెక్కి పైకెళ్ళాం. అమ్మో రూమా అది! హెంతమాట హెంతమాట, జాతినెపమున మూతిమూస్కుని మాలాంటి బ్యాచిలర్ గాళ్ళంతా ఉండేందుకు అనువైన స్థలమువలే యున్నది. అట్టి ప్రదేశమున గోడకున్న కింగ్ఫిషర్ కేలండర్ ఫేన్ గాలికి పైకిలెగుస్తా ఉంటే, ఎక్సట్రా ఎక్స్పోజింగ్ మోడ్ ఏక్టివేట్ చేసి ఎమోషన్స్ కి బదులు ఎరక్షనొచ్చేలా చేసే ఎగ్జిబిషన్ పెట్టినట్టుంది. అంతయునూ గాక అచ్చోటనే వొంటిమీద ఎటుల ఉన్నా కవర్ ఫోటోలలో కొద్దిమొత్తం బట్టలేసుకుని కామంకూడా కామన్సెన్స్ అనే కనీస విద్య నేర్పుతున్నట్టు స్వాతీ పుస్తకాలు పడుంటే, కొందరు రాసీ రాసీ సన్నబడిన పర్సనాలిటీ డవలప్మెంట్ పుస్తకాలూ, ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ మాటాడండి టైటిలూ, నేలమీద పడిదొర్లుతూ వాటి మినిమం ఉనికిని తెల్లమొగాలేసుకుని మేగ్జిమం చాటుతున్నాయి. తెచ్చిన సిగరెట్ వెలిగించుకుని బాల్కనీ అనబడు డంప్ యార్డ్లోకి పోయాడొకడు. కోజీలాన్ పరుపుకి కజిన్లాంటి లావుపాటి బొంతని తెచ్చి నేలమీద పరిచాడు పరిమి గారు. పరిమిగాడంటే పరమేష్. వాడికి గాడు అనేది యాడెడ్ రెస్పెక్ట్ లెండి. అటు మెచ్చూర్డూ ఇటు ఇమ్మెచ్చూర్డూ కాకుండా మధ్యస్థంగా ముప్పేట పరువులో నిల్చిపోయిన నందుగాడి కళ్ళకి చిన్న చిన్న పాండ్స్ కోల్డ్ క్రీములూ, హండ్రడెమ్మెల్ పేరాషూట్ కొబ్బరినూనె డబ్బాలూ కనిపించాయి. అంతటితో ఆగక ఇంకనూ ముందుకు పోయింది వాడి ఉత్సాహం. నేను ఊహించినంత పెద్దప్రమాదమేమీ జరగలేదు. వాడికళ్ళకి ఇంకా పెద్ద సైజు కోల్డ్ క్రీమ్ డబ్బా కనిపిస్తే “ఇదేందిరా ఇన్నిగనం కొనుకున్నడు” అన్నాడు. ఆ రెండింటి యూసేజూ అలగ్ అలగ్ అన్నా నేను....... వాడికర్దమయ్యిందో లేదో పట్టించుకోకుండా రాత్రి అంతయూ నవ్వుకున్నాం.
_కాశిరాజు

Comments

Popular posts from this blog

F1.

కొంత సేపటికి ముందు.
"స్నానానికెళ్లినట్టున్నావ్" ఫోన్ తీసుకోలేదు.

కొంత సేపటి తర్వాత
స్నానం చేస్తూ, నన్ను అర్ధం చేసుకున్నావో, అలవాటు చేసుకున్నావో
ఆలోచిస్తూ
తలపై నుంచి పోసుకున్ననీళ్లలో కలిసి ఇంకా ఇంకా కిందకి జారిపోతాను.
నీ ఒళ్లోకి, అక్కన్నుంచి సగం కలిపి నువ్వొదిలేసిన చద్దన్నం గిన్నెలోకి
అక్కన్నుంచి కొంచెం లేటుగానైనా నువ్వు కొనిచ్చిన ప్రతీ వస్తువులోకి
దూరిపోతాను.

మరికొంత సేపటి తర్వాత
మళ్లీ నీకు ఫోన్ చేసి, "ఇందాక ఏం చెప్పాలో తెలీక ఫోన్ కావాలని తీసుకోలే"దంటాను.
నువ్వేమో తెలుసులే అని కూడా అనవు. నిజంగా నవ్వుతావు
మా చిన్నిప్పుడు నువు చాలా మందికి చెప్పిన "కొంచెం ఇబ్బందుంది ఇంకొక్కరోజాగు" అన్న మాటలా ఇప్పుడు నేను
ఓ ఐదారు నిమిషాలు నిజంగా బతగ్గలిగితే చాలు నాన్నా .

కనీసం

నడుస్తూనో నటిస్తూనో
కొంత మాట్లాడుకుని, వెళ్లిపోతూ నవ్వుకునే ముఖాలమే మనం

ఇంకా కుదిరితే
అనుకుంటున్న ఇష్ట సమాధిలోకి చెరోసగం చేరిపోదాం
ముడివేయబడొద్దని నువ్వో,
ముచ్చటైనా తీరుద్దని నేనో, మళ్ళీ మళ్ళీ కనీసం కలుద్దాం.
ఇంకా కుదిరితే ...
నువ్వు సమస్తమవ్వు, నేను చివరంచుకి నడుస్తా

షేరాటో

పళ్లుగిట్టగరిసి కళ్ళు మూసీ తెరుస్తూ వొస్తున్నమంటనాపుకుంటూ బతిమాలుతుంటే మెల్లగా ఏల్లెంబడి ఉచ్చ ఉండుండీ కొన్ని చుక్కలు కారాక , విదుల్చుకునీ వెనక్కొంగీ రోడ్డేపు చూస్తే దూరంగా ఎక్కాల్సిన బసొస్తుంది. పనేమో పూర్తవలేదు. కాళ్ళు రెండూ ఎడంగాపెట్టి ఇంకా తినికీ,తినికీ బతిమాలుతూనే ఉన్నాను. బసు దగ్గిరపడేకొద్దీ కంగారుతో కాత గట్టిగా జిప్ లాగితే ఉన్నది కాస్తా విరిగిపోయింది. నవ్వకండి నేన్నన్నది జిప్ గురుంచేలెండి. అప్పటిదాకా ఏక్షన్ షూమీద మెరుస్తున్న ఇస్త్రీపేంటుకున్న అందమంతా దొబ్బింది. మన దర్శన భాగ్యం, భాగోతం భాగ్యనగరమెందుకు చూడాలని, ఇన్సట్ తీసేసి చూసుకుంటే పొడుగు చొక్కాలో పెద్దాపురం తిరునాల్లో గెడలుమీద నడిచే జోకర్గాడిలా ఉన్నాను. గబ్బిలాయుల్లా ఊచలుపట్టుకు వేలాడుతున్న సమరవీరుల చంకల్లో వోసన పీలుస్తూనే ఎవడిదో కాలు కాతపక్కకు జరిపి నాకాలికోసం ఖాళీ చోటు చూసుకున్నాక పట్టుకోసం ఏదీ దొరకని కారణాన ఎవడిదో ఏదో పట్టుకు చిరాకుబడిపోయాక, వాడన్నాడు. “అయ్యో భయ్యా నాకున్నదొక్కటే బెల్టు. అదీ తెగిపోయింది ఇన్సట్ చేయకపోతే మా బాస్ తిడతాడు” అంటుంటే , విభూదితో అడ్డబొట్టు మీద తెలుగూ,తమిళం కలిసిన మొకంతో దాదాపుగా ఎంకన్నబాబు రంగున్న …