పోస్ట్‌లు

January, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది
నెక్లెస్ రోడ్ నుంచి నేచర్ క్యూర్ దాకా టికెట్ తీసుకుని అతి దగ్గరదార్లో హాస్టల్ దాకా నడిచొచ్చి చాయోన్ని పలకరించినందుకు పెద్దగా చెప్పుకోలేని బొక్కపడింది. ఎయిర్టెల్ ఎస్సెమ్మెస్ పేక్ తొమ్మిది రూపాయల రీచార్జ్ మాదగ్గర లేదంటే మాదగ్గర లేదన్న సమాధానం ఇనీ ఇనీ ఇసుగొచ్చి బల్కం పేట బాలాజీ కిరాణందాకా నడిసొచ్చిసచ్చాక, ఆడొక దేముడు. సిరాకు నిండిన నా మొకంమీద అత్తరు జల్లిన నవ్వొకటి ఇసిరి, అక్కడుంటుందన్న ఆన్సర్ని కళ్ళతోనే సెప్పాడు. ఆతని మోము సూసి నవ్వేను నా సామిరంగ!.
అచ్చం గుమ్మడి పువ్వులాగ, తెలంగాణా గడ్డమీద ఈడొచ్చిన గడుసు గుమ్మడి పువ్వలాంటి పిల్ల "ఎక్స్క్యూజ్ మీ" అంటంటే వొయ్యారంగా జేబులో చేతులు పెట్టాక చిరిగిపోయున్న పేంటు కదా! అది కూడా ఇంటర్వ్యూల కోసం కొన్నది . చిల్లున్న జేబులోంచి చేతికేదో తగిల్తే మనది కుడిచేతి వాటం కదా చెయ్యి మార్చి ఇటేపు ఎడం పక్క జేబులోంచి తొమ్మిది రూపాయల చిల్లర ఏరేదాకా ఆపిల్ల ఇంకెంత అందంగుందో చూళ్ళేదు. 'ఎయిర్టెల్ తొమ్మిది రూపాయల ఎస్సెమ్మెస్ రీచార్జ్" చేయండన్నాను. మొద్దు కీపేడున్న నోకియా ఫోననుకుంటా ముందుకు తోసి తన పనేదో తాను చూస్కుంటా ఉంది . రోజూ వొచ్చి రీచార్జ్ చేస్…

షేరాటో

పళ్లుగిట్టగరిసి కళ్ళు మూసీ తెరుస్తూ వొస్తున్నమంటనాపుకుంటూ బతిమాలుతుంటే మెల్లగా ఏల్లెంబడి ఉచ్చ ఉండుండీ కొన్ని చుక్కలు కారాక , విదుల్చుకునీ వెనక్కొంగీ రోడ్డేపు చూస్తే దూరంగా ఎక్కాల్సిన బసొస్తుంది. పనేమో పూర్తవలేదు. కాళ్ళు రెండూ ఎడంగాపెట్టి ఇంకా తినికీ,తినికీ బతిమాలుతూనే ఉన్నాను. బసు దగ్గిరపడేకొద్దీ కంగారుతో కాత గట్టిగా జిప్ లాగితే ఉన్నది కాస్తా విరిగిపోయింది. నవ్వకండి నేన్నన్నది జిప్ గురుంచేలెండి. అప్పటిదాకా ఏక్షన్ షూమీద మెరుస్తున్న ఇస్త్రీపేంటుకున్న అందమంతా దొబ్బింది. మన దర్శన భాగ్యం, భాగోతం భాగ్యనగరమెందుకు చూడాలని, ఇన్సట్ తీసేసి చూసుకుంటే పొడుగు చొక్కాలో పెద్దాపురం తిరునాల్లో గెడలుమీద నడిచే జోకర్గాడిలా ఉన్నాను. గబ్బిలాయుల్లా ఊచలుపట్టుకు వేలాడుతున్న సమరవీరుల చంకల్లో వోసన పీలుస్తూనే ఎవడిదో కాలు కాతపక్కకు జరిపి నాకాలికోసం ఖాళీ చోటు చూసుకున్నాక పట్టుకోసం ఏదీ దొరకని కారణాన ఎవడిదో ఏదో పట్టుకు చిరాకుబడిపోయాక, వాడన్నాడు. “అయ్యో భయ్యా నాకున్నదొక్కటే బెల్టు. అదీ తెగిపోయింది ఇన్సట్ చేయకపోతే మా బాస్ తిడతాడు” అంటుంటే , విభూదితో అడ్డబొట్టు మీద తెలుగూ,తమిళం కలిసిన మొకంతో దాదాపుగా ఎంకన్నబాబు రంగున్న …

అలగ్ అలగ్

రాసే అలవాటు గురుంచి ఒకడితర్వాతొకడు అడిగీ అడిగీ ఈ మధ్య అడల్టరీ రాస్తున్నవెందుకురా అన్నారు? “అద్దరాత్రి తొడలమధ్యంటుకున్న వేజిలిన్ జిడ్డులాంటివిరా కొన్ని అలవాట్లు. కడిగేసుకుందామంటే ఒకసారితో వొదిలిపోవన్నాను” మళ్ళీ నోరుతెరిస్తే నారాయణ మంత్రంరా బాబూ! ఛీ ఛీ అన్నారు మూకుమ్మడిగా. అప్పుడప్పుడెల్లి ఉచ్చపోసుకునొస్తున్నప్పటికీ. ఐదారుగంటలు ఉగ్గబట్టుకు కుచ్చున్నందుకు నలుగురూ తాగిందానికి ఆడొక్కడే బిల్లు కట్టాడు. నిన్నా మొన్నా చేతిలో రూపాయ్ లేదు కదా! ఇవ్వాళ ఇదేంట్రా నాయనా అన్న ఫీలింగ్ ని పర్స్లోకి తోసేస్తూ ఓ రెండొందలు బయటకు తీసి ఓ యాభై మందు సెర్వ్ చేస్తున్న పిల్లాడికిస్తుంటే వాడస్సలు తీసుకోలేదు. మారేషంలో వొచ్చిన కుబేరుడి కొడుకేమో అని మనసులో అంకుంటా “పోన్లే ఓ యాభై మిగిల్చావు తమ్ముడూ అని పైకన్నాను “. నవ్వుకుంటూ “విజిటెగైన్ సార్ ” అన్నాడు. మావి మళ్ళీవొచ్చే మోకాళ్లా ఆ పిల్లాడికి కనిపించుండవు. ఆ మాటే అతనితో అని “ఈసారి మేం మళ్ళీ ఈ బారుకొస్తే , సార్ కాదు అన్నయ్యా అను’ చాలన్నాను. “ యూ ఆర్ మోస్ట్ వెల్కం” అన్నాడు. అది మూసుకుని దొబ్బేయ్రా అన్నట్టు వినిపించింది. మళ్ళీ వాడి మొఖం చూశాను. నవ్వాడు, అందులో ఆ నవ్వులో ఇ…