పోస్ట్‌లు

August, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

తప్పులేదు

అంతరంగాల్లో, అహాల్లో
ఎవరు ముందు బయటడితే వాళ్ళు లోకువైపోతామని
ప్రపంచ ప్రేమికుల పర్వర్షన్ తో ఆలోచిస్తూ
ఇద్దరం నోర్మూసుకున్నాక
ఏం జరక్కపోయినా, ఎంత జరిగినా తప్పులేదు


మసకమాటలతో మధిలో ఏమనుకుంటున్నావో మాస్ కాపీయింగ్ చేస్తున్నపుడు
ఎజాకులేటెడ్ సోల్ తో ఎరెక్టెడ్ మైండ్ ని కంట్రోల్ చేయడం కష్టమేమీ కాదు.
అనుకుంటే, ఆలోచించుకుంటే
అబద్దం తప్పేమీ కాదనీ,మోసం జీవితమైపోలేదనీ

ప్రూఫ్ రీడింగ్ చేసుకుంటూ పోతే
పదిమందైనా మిగుల్తారని తెలుస్తుంది.
అపుడు కూడా అబద్దం అనివార్యమని ఎవరికీ చెప్పొద్దు.

||ముందుమాట-10 ||

ఎప్పుడైనా కలిసి కూర్చున్నపుడు కతల గురించీ ప్రత్యేకతల గురించి మాట్లాడుకుంటాము . నువ్వు ప్రత్యేకమైనోడివనీ అందర్లాగ మాట్లాడవనీ అంటుంటావు. అవును ఒంటరిగా వున్నపుడు మనం నోళ్ళు మూసుకుని మాట్లాడుకున్నదీ,కళ్ళు తెరుచినా ఎవరూ కనపడరన్నదీ మన సాంగత్యపు గత్యంతరమనీ నీకెప్పుడూ చెప్పను. నువ్వేమో ముద్దిచ్చి ప్రత్యేకతను గుర్తుచేసాక మూత్తుడుచుకుంటూ లోపల వేడెక్కిన రక్త ప్రవాహాన్ని ధమనుల భాషలో నీకు చెబుదామని చూస్తాను. నీకేమో ఆ ప్రత్యేకత పద్దతైంది కాదంటావు.


ఏదైనా కాళీ దొరికిన గురువారాల్లో గుడీ, దేవుడూ, మెట్లూ వాటిపైన మనమూ కర్పూరాన్ని పులుముకుంటూనో కొబ్బరిముక్క కొరుక్కుంటూనో కూర్చుంటాము. నేను వేసిన ఒట్టు నువ్వు పెట్టిన కుంకుమబొట్టు ఎంతో మంది చూస్తారు. మనం అలా రాతిమెట్లమీద రాత్రిదాకా రాసుకున్నందుకూ ఆ గుడి పూజారి దీవించేస్తాడు. దేవుడేమో చూల్లేక తలుపులు మూసేసుకుంటాడు. నేను మళ్ళీ రక్తం వేడెక్కించే ధమనుల భాషలోనే మాట్లాడాలని చూస్తాను. నువ్వేమో ఆ రాతి మెట్లూ నా గుండె ఒకటేనని నిందిస్తుంటావు.

||మెళుకువ||

మొనమొన్ననే అద్దంమ్మీద ఆవిరి ఊది గీసుకున్న లవ్ సింబలన్నీ ప్రేమించడాన్ని పెద్దగా ఏం నేర్పలేదని తెలుసుకున్నాక మళ్ళీ ఒకసారి తప్పక ఎవరో ఒకర్ని కలుసుకుంటాం అట్టి వేళ లావా లోపల పొంగుతున్నా లాలాజలం రానీయకుండా తెచ్చిన వాటర్ బాటిల్ మాత్రమే తాగాలనుకుంటామ్. మంచితనం ముసుగులో ముద్దొచ్చే మాటలని ఏమాత్రామూ తడబడి పొరబడిపోనీకుండా జీవితమంటే పెద్దగా నిర్వచనాలక్కర్లేదనీ వృద్ధాప్యంలో కలిసి కూర్చుని క్రాస్ వర్డ్ పజిల్ నింపుకుందామనీ, మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ దగ్గరకు జరిగి సమయం మించిపోతుండగా దగ్గరైపోయి చేసుకున్న పున్నమినిండా తెల్లని వెన్నెల నవ్వుల్ని ఏరుకుంటామ్. ఆ తర్వాత సమయాలవలే మనుషులమైన మనమూ మించిపోతామ్. మతిమరుపు నిద్దర్లోకి జారిపోలేక కన్నంచున కునుకేయలేక జీవితాన్ని కళ్లుతెరిచి చూస్తూనే ఉండిపోతామ్.

ముందుమాట- 9

హ్రుదయ వైశాల్యంలో ఇష్టాన్ని ఎందుకు కప్పెట్టుకోవాలని
నచ్చినట్టు చెప్పి సచ్చాక

ప్రూఫ్ రీడింగ్లో కావాలని కామాలిచ్చి కామాన్ని మొత్తం కాల్చేస్తావ్
ఎక్స్ట్రా లార్జ్ ఏసాల్ని మోగుతున్న రిబ్డ్ రింగ్టోన్ని సైలెంట్ మోడ్లో నుంచి మూడ్ మార్చేస్తావ్


ఉండీ ఉండీ ఉండలేక
నచ్చడం తప్పనిపిస్తుంది వదులుకోడం కుదరదని
పర్వర్టెడ్ మైండ్ ప్రాణం తీసేసుకుంటూ
అదంతే
అన్నీ అడిగేసాక
ఒక్కొక్కరి ముందు ప్రాణం ఉనికి కోల్పోయిబతకాలి