మెలుకువ

మొనమొన్ననే అద్దంమ్మీద ఆవిరి ఊది గీసుకున్న లవ్ సింబలన్నీ ప్రేమించడాన్ని పెద్దగా ఏం నేర్పలేదని తెలుసుకున్నాక మళ్ళీ ఒకసారి తప్పక ఎవరో ఒకర్ని కలుసుకుంటాం  అట్టి వేళ  లావా లోపల పొంగుతున్నా లాలాజలం రానీయకుండా  తెచ్చిన వాటర్ బాటిల్ మాత్రమే తాగాలనుకుంటామ్. మంచితనం ముసుగులో ముద్దొచ్చే మాటలని  ఏమాత్రామూ తడబడి పొరబడిపోనీకుండా జీవితమంటే పెద్దగా నిర్వచనాలక్కర్లేదనీ  వృద్ధాప్యంలో  కలిసి కూర్చుని క్రాస్ వర్డ్ పజిల్ నింపుకుందామనీ, మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ దగ్గరకు జరిగి సమయం మించిపోతుండగా దగ్గరైపోయి  చేసుకున్న పున్నమినిండా తెల్లని నవ్వుల వెన్నెల్ని ఏరుకుంటామ్. ఆ తర్వాత సమయాలవలే మనుషులమైన మనమూ  మించిపోతామ్.  మతిమరుపు నిద్దర్లోకి జారిపోలేక కన్నంచున కునుకేయలేక జీవితాన్ని కళ్లుతెరిచి చూస్తూనే ఉండిపోతామ్.

Comments

Popular posts from this blog

కనీసం

F1.

షేరాటో