||ముందుమాట- 6||

నేను ఆలోచించడంలోనూ నువ్వు ఆచరించడంలోనూ ఉండిపోయామన్న నిజం తెలిస్తే నా ప్రాక్టికల్ అండ్ అవుట్ స్పోకెన్ మాటలెప్పుడూ సిగ్గులేనివి కాదు . నీ బుద్దే అంత నాకు తెలీదా అని నేను అనుకున్నదే నువ్వు చెబుతావనీ అంటావ్. నేను అనుకొని ఆగిపోయినదానికీ నువ్వు అలోచించి అనేసినదానికీ నువ్ పెట్ట్టిన పేరు మగబుద్ది. కాసేపు దాన్నలా ఉండనియ్. నిన్ను ఒప్పించడానికో నన్ను నేను తప్పించుకోడానికో నీజడ బాగుందనీ నీబొట్టుబిళ్ళ భలే ఉంటుందనీ అనలేదు . అప్పుడు జడ ముందేసుకుని బొట్టుబిళ్ళ సర్దుకుని నవ్వినదంతా నాటకమని నాకు తెలీదు.


పర్లేచ్చేప్పు మేథ్స్ క్లాసే, సార్ లేడు అంటాను. ఎప్పుడొస్తున్నావ్ అనడుగుతావ్ . టికెట్ కన్ఫాం కాలేదంటాను. అది నా చేతిలో పని అంటూ చుప్ మన్న చప్పుడేదో చేస్తావ్. అది ముద్దని అనుకునే బయల్దేరతాను. రైల్లో బ్రమిస్తూనే రమిస్తాను. నిన్ను చేరేసరికి రాత్రిమొత్తం తెల్లారుతుంది. రైల్వేస్టేషన్ రంగు మారుతుంది . ఇద్దరం కలిసి టిఫిన్ చేసిన దగ్గర్నుండీ మళ్ళీ నేను బయల్దేరేవరకూ నా ప్ర్రాక్టికల్ అండ్ అవుట్ స్పోకెన్ మాటలు అస్సలు నచ్చవు నీకు. దగ్గరవడం అంటే భౌతికమైన దూరం తగ్గడం కాదని ఏదో ఉదాత్తమైన మాట చెప్తాను. దగ్గరవడం అంటే ముద్దెట్టుకోవడం కాదంటూనే ఆ రైల్వే స్టేషన్లో ప్రయానికులకు విజ్ఞ్యఫి అన్న డైలాగ్ వినకుండా చేస్తావ్. అందుకు కదా ఓ ముద్దు కోసం ఎప్పుడూ నిందల్ని నామీదేసుకుంటాను.

వ్యాఖ్యలు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ప్రముఖ పోస్ట్‌లు