||ముందుమాట -5||


ఏం దాచిందని వెన్నెల్ని అలా నిందిస్తున్నావ్? బోల్డంత ఆకాశంకింద ఇంకా బోల్డంత భూమి దానిమీద మనం తిరిగిన ఓ ఊరు, ఇంకా పెద్ద చింతచెట్టు. అవన్నీ ఆ రాత్రి మనం లెక్కేసుకున్నవే కదా! దోమ కుడుతుందని ఆ వోని ఇటివ్వు అనడుగుతుంటే నిజంగా నిన్ను కుట్టేది దోమకాదని వెన్నెల వేడెక్కించిన ఆలోచననీ ఆ వెన్నెలనీ నన్నూ నిందించావ్. నా పక్కకు జరిగి చెట్లకు చలేయదా అంటే అవి గాలిని కప్పుకుంటాయన్నాను. మరి గాలికీ? అనడిగితే అది చెట్లను ఇలా చుట్టేసుకుంటుందనీ చేసి చూపించాను. చెట్లకు నాలా ఊపిరాడక పోతేనో అనడిగావ్. గాలి నాఅంత మొరటుది కాదులేవే అన్నాను.

చీకటి మీద ఆ చెరువుగట్టు మీదా చాలా సేపు కూర్చుని కనుచూపుమేరా కనబడే నీళ్ళలో మొకం చూసుకుని మురిసిపోతున్నఆ చిన్న సంద్రున్ని నీకు పరిచయం చెయ్యాలనుకునే లోపు చీకటి నన్ను మోసం చేసింది. చెరువు గట్టుకి పొద్దెక్కేసింది.తెల్లవార్లూ నువ్వు నీలా లేవు అంటుంటే నవ్వడమైతే నవ్వానుగానీ ఆ రాత్రి ఏమీ జరగనందుకు మన మోహాలుతీరి మోహాలు మెరవనందుకూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ పొద్దెక్కినా ముకం కడగనందుకూ రోజంతా వెన్నెల్లోని మగపిల్లాడు ఎంత చిత్రంగా చీకటైపోతాడోనని పిచ్చిగా ఎండలో నడుస్తూ ఆలోచిస్తున్నందుకూ భాదేస్తుంది

Comments

Popular posts from this blog

కనీసం

F1.

షేరాటో