పోస్ట్‌లు

October, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

పదార్రూపాయలు

చెంచాతో పక్కకి ఇడ్సిన కలేమాకు జూసినంక
గత్తింటే ఏమైతదన్నట్టు నవ్వేసిన నీముకం యాద్కొస్తదే

సాంబారు పోయాల్నా బిడ్డా అన్నంక నేంగూడ నవ్తా తే
ఇట్లకెల్లొస్తవ్ ఏడుంటవని అడిగినంక
నీకంట్లనే అని సెప్పబుద్దైతది


నువ్వు తింరాతమ్మీ అని ఓ రొండు వడేయాల్నా అంటే
తలూపుతా
కడుపు నిండినా తలెందుకూపిన్నో తెల్సా
మందికి మామూల్గానే పడేసి నాకు వడ ఇరిసివెడ్తావ్
ఆ ప్రేమకే నాకాకలైతదే.

యాద్గిరీ
గంద్కనే ఆఫీస్కొయ్యేటపుడు జోబులో
ప్లేట్ వడకోసమని పదార్రూపాయలు పెడ్తనే.

(బయట బల్లుమీద ఎక్కడైనా టిఫిన్ చేస్తే ఆకలేసి ఓ వడో ఇడ్లీనో వెయ్రా నాయనా అంటే చూసీ చూడకుండా ప్లేట్లో పడేస్తాడు. కానీ మా యాదగిరిన్న ఇడ్లీ వడపెడితే ఇరిసి మరీ ప్లేట్లో పెట్టి సాంబారు పోసిస్తడు. ఆ హాస్పిటాలిటీకి నా హార్ట్ పడిపోయింది.

||ముందుమాట- 6||

నేను ఆలోచించడంలోనూ నువ్వు ఆచరించడంలోనూ ఉండిపోయామన్న నిజం తెలిస్తే నా ప్రాక్టికల్ అండ్ అవుట్ స్పోకెన్ మాటలెప్పుడూ సిగ్గులేనివి కాదు . నీ బుద్దే అంత నాకు తెలీదా అని నేను అనుకున్నదే నువ్వు చెబుతావనీ అంటావ్. నేను అనుకొని ఆగిపోయినదానికీ నువ్వు అలోచించి అనేసినదానికీ నువ్ పెట్ట్టిన పేరు మగబుద్ది. కాసేపు దాన్నలా ఉండనియ్. నిన్ను ఒప్పించడానికో నన్ను నేను తప్పించుకోడానికో నీజడ బాగుందనీ నీబొట్టుబిళ్ళ భలే ఉంటుందనీ అనలేదు . అప్పుడు జడ ముందేసుకుని బొట్టుబిళ్ళ సర్దుకుని నవ్వినదంతా నాటకమని నాకు తెలీదు.


పర్లేచ్చేప్పు మేథ్స్ క్లాసే, సార్ లేడు అంటాను. ఎప్పుడొస్తున్నావ్ అనడుగుతావ్ . టికెట్ కన్ఫాం కాలేదంటాను. అది నా చేతిలో పని అంటూ చుప్ మన్న చప్పుడేదో చేస్తావ్. అది ముద్దని అనుకునే బయల్దేరతాను. రైల్లో బ్రమిస్తూనే రమిస్తాను. నిన్ను చేరేసరికి రాత్రిమొత్తం తెల్లారుతుంది. రైల్వేస్టేషన్ రంగు మారుతుంది . ఇద్దరం కలిసి టిఫిన్ చేసిన దగ్గర్నుండీ మళ్ళీ నేను బయల్దేరేవరకూ నా ప్ర్రాక్టికల్ అండ్ అవుట్ స్పోకెన్ మాటలు అస్సలు నచ్చవు నీకు. దగ్గరవడం అంటే భౌతికమైన దూరం తగ్గడం కాదని ఏదో ఉదాత్తమైన మాట చెప్తాను. దగ్గర…

||ముందుమాట -5||

ఏం దాచిందని వెన్నెల్ని అలా నిందిస్తున్నావ్? బోల్డంత ఆకాశంకింద ఇంకా బోల్డంత భూమి దానిమీద మనం తిరిగిన ఓ ఊరు, ఇంకా పెద్ద చింతచెట్టు. అవన్నీ ఆ రాత్రి మనం లెక్కేసుకున్నవే కదా! దోమ కుడుతుందని ఆ వోని ఇటివ్వు అనడుగుతుంటే నిజంగా నిన్ను కుట్టేది దోమకాదని వెన్నెల వేడెక్కించిన ఆలోచననీ ఆ వెన్నెలనీ నన్నూ నిందించావ్. నా పక్కకు జరిగి చెట్లకు చలేయదా అంటే అవి గాలిని కప్పుకుంటాయన్నాను. మరి గాలికీ? అనడిగితే అది చెట్లను ఇలా చుట్టేసుకుంటుందనీ చేసి చూపించాను. చెట్లకు నాలా ఊపిరాడక పోతేనో అనడిగావ్. గాలి నాఅంత మొరటుది కాదులేవే అన్నాను.

చీకటి మీద ఆ చెరువుగట్టు మీదా చాలా సేపు కూర్చుని కనుచూపుమేరా కనబడే నీళ్ళలో మొకం చూసుకుని మురిసిపోతున్నఆ చిన్న సంద్రున్ని నీకు పరిచయం చెయ్యాలనుకునే లోపు చీకటి నన్ను మోసం చేసింది. చెరువు గట్టుకి పొద్దెక్కేసింది.తెల్లవార్లూ నువ్వు నీలా లేవు అంటుంటే నవ్వడమైతే నవ్వానుగానీ ఆ రాత్రి ఏమీ జరగనందుకు మన మోహాలుతీరి మోహాలు మెరవనందుకూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ పొద్దెక్కినా ముకం కడగనందుకూ రోజంతా వెన్నెల్లోని మగపిల్లాడు ఎంత చిత్రంగా చీకటైపోతాడోనని పిచ్చిగా ఎండలో నడుస్తూ ఆలోచిస్తున్నందుకూ భాదేస్తు…

||ముందుమాట -4||

ఎప్పుడైనా కలిసి కూర్చున్నపుడు కతల గురించీ ప్రత్యేకతల గురించి మాట్లాడుకుంటాము . నువ్వు ప్రత్యేకమైనోడివనీ అందర్లాగ మాట్లాడవనీ అంటుంటావు. అవును ఒంటరిగా వున్నపుడు మనం నోళ్ళు మూసుకుని మాట్లాడుకున్నదీ,కళ్ళు తెరుచినా ఎవరూ కనపడరన్నదీ మన సాంగత్యపు గత్యంతరమనీ నీకెప్పుడూ చెప్పను. నువ్వేమో ముద్దిచ్చి ప్రత్యేకతను గుర్తుచేసాక మూత్తుడుచుకుంటూ లోపల వేడెక్కిన రక్త ప్రవాహాన్ని ధమనుల భాషలో నీకు చెబుదామని చూస్తాను. నీకేమో ఆ ప్రత్యేకత పద్దతైంది కాదంటావు.

ఏదైనా కాళీ దొరికిన గురువారాల్లో గుడీ, దేవుడూ, మెట్లూ వాటిపైన మనమూ కర్పూరాన్ని పులుముకుంటూనో కొబ్బరిముక్క కొరుక్కుంటూనో కూర్చుంటాము. నేను వేసిన ఒట్టు నువ్వు పెట్టిన కుంకుమబొట్టు ఎంతో మంది చూస్తారు. మనం అలా రాతిమెట్లమీద రాత్రిదాకా రాసుకున్నందుకూ ఆ గుడి పూజారి దీవించేస్తాడు. దేవుడేమో చూల్లేక తలుపులు మూసేసుకుంటాడు. నేను మళ్ళీ రక్తం వేడెక్కించే ధమనుల భాషలోనే మాట్లాడాలని చూస్తాను. నువ్వేమో ఆ రాతి మెట్లూ నా గుండె ఒకటేనని నిందిస్తుంటావు.

||ముందుమాట- 3||

ఎప్పుడూ ఏమ్మాటలవి నీకు సిగ్గేలేదా అంటుంటావు. నాకు నవ్వు రాదు అయినా నవ్వడం తప్పదు. లోలోపల లోబరచుకోవడం గురించి కుట్రపన్నుతాను. తెలిసీ లేదా తెలియక ఒకేలా ఉంటావు నువ్వు . నేను లోతుగుండెల మనిషినని ఏదీ అర్ధం కానివ్వకుండా వ్యర్ధమూ కానివ్వకుండా మసులుతానని మళ్ళీ నువ్వే అంటావు . ఇంకేదైనా చెప్పు అనేస్తాను. పెళ్ళిచేసుకుందాం అంటుంటావు. సరే తర్వాత ఏంచేద్దాం అనడిగితే పొద్దుటే చుక్కలు చూపిస్తాననీ గుమ్మం ముందు ముగ్గేస్తాననీ ఆ ముగ్గులో నన్ను దించేసి మెలికలు తిప్పిస్తానని ఏదేదో చెబుతావు. అన్నీ అలాగే ఊకొడుతూ నువ్వు లయ తప్పకుండా ఇంకేం చేస్తావు అనడుగుతాను. నేనేనా నువ్వూ చెప్పు అన్నట్లు చూస్తుంటే నీ ముగ్గుచిప్పకి ముద్దెడతాననీ , నీ మెలికలన్నిటికీ రంగద్దుతాననీ అంటాను. అంతేనా అన్నట్టు మళ్ళీ ఓ చిన్నచూపు.

        నడుస్తూ నడుస్తూ చేతికి తగిలిన గోరింటాకు రొబ్బ విరిచి ఇదంటే ఇష్టం నాకు అంటుంటావు. అవును అదీ తెచ్చిస్తానంటాను. ఇంకా వంక వెతికి నలిపేస్తాననీ ఆ గోరింటాకును నలిపేస్తాననీ ముద్దుగా ముద్దలు చుట్టి వేళ్ళచుట్టూ అంటిస్తాననీ అంటాను. కదలకుండా చేసి నీ చేతులు కదలకుండా చేసి పండిస్తాననీ గోరింటాకు పంట పండిస్తాననీ అంటాను.…