||ముందు మాట-2 ||

నా లోచనాలూ నా ఆలోచనాలూ తప్పేనని అంటుంటావనీ నేను కాస్త విసుగ్గానూ వికారంగానూ తోస్తాను కామోసు. నేను మొరటోన్ననీ నా మాటలెపుడూ కటువేననీ అంటుంటే అలవాటు ప్రకారం అటెటో చూస్తాను. ఏదో చెప్తానన్నావ్ ఏంటదీ అని నువ్వేసిన ప్రశ్నకి గుటకలు వేస్తూ అభ్యర్ధనలాంటి ప్రశ్నలడుగుతాను మరి రెండోది అన్నపుడు మొదటి జవాబుకి నువ్విచ్చిన చొరవతో తెచ్చుకున్న ధైర్యంతో అడగాలనే అనుకుంటూ నీముకం చూల్లేక ఎటో తిప్పుకునీ అదీ అడిగేస్తాను . చూళ్ళేదు గనక నువ్వు నవ్వినట్టు అనిపిస్తున్నా నిర్దాక్షినంగా అది నిర్దారించుకోలేను. అప్పటి మన మౌనం భరించలేనంత భాదగా ఏదో పాపం చేసి వైతరణీ నదిని దాటుతున్నట్టే ఉంటుంది .

ఇక మూడోదేంటీ అంటుంటే నువ్వసలు వింటున్నావా లేదా అన్న దేహంతో సందేహంతో చేతుల్లోకి చేయి తీసుకుని మతించేసావు ఇక అనుమతించేసావు అన్నట్టుగానే మళ్ళీ అడిగేస్తాను. అప్పుడు సమాధానంగా చేతిలో చేయి తప్పిస్తున్నవో తీసేసుకుంటున్నావో అర్ధం కాదు. మనకు దొరికిన అర్ధగంటకూ మౌనం అర్ధాంగీకారం కాదనే కథ నాకు తెలుసు గనక ఇంకా ఏదన్నా చెబుతావనే ఎదురుచూస్తాను. ఏంకావాలో ఎందుకు కావాలో చెబుతున్న కొద్దీ వినేసి నా చేతిలో నలుగుతున్న నీ జడబంతి పువ్వును లాక్కుంటూ పువ్వుని వాసన చూసి ముద్దెట్టుకున్నదీ , ముద్దెట్టుకునీ వాసన చూసిందీ వేరు వేరని అంటావ్. నాకేమో మెడబడి మాటరాదు. ఇకపై పువ్వుల్ని కేవలం ప్రేమిస్తానని మాటిస్తాను. సున్నితత్వం తెలిసేంతవరకూ క్షమిస్తావా?

వ్యాఖ్యలు

 1. ఏదో కథలా , పాఠం లా కాక కవితలా లైన్ల వారీగా వ్రాయండి .. చదవడానికి బాగుంటుంది.
  ఎలా అంటే -
  ఇక మూడోదేంటీ అంటుంటే
  నువ్వసలు వింటున్నావా లేదా అన్న దేహంతో
  సందేహంతో
  చేతుల్లోకి చేయి తీసుకుని మతించేసావు
  ఇక అనుమతించేసావు అన్నట్టుగానే
  మళ్ళీ అడిగేస్తాను. అప్పుడు
  సమాధానంగా చేతిలో చేయి తప్పిస్తున్నవో తీసేసుకుంటున్నావో అర్ధం కాదు.
  మనకు దొరికిన అర్ధగంటకూ
  మౌనం అర్ధాంగీకారం కాదనే కథ నాకు తెలుసు
  గనక ఇంకా ఏదన్నా చెబుతావనే ఎదురుచూస్తాను.

  ప్రత్యుత్తరంతొలగించు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ప్రముఖ పోస్ట్‌లు