రాఖీ

ఎర్రపొడిలో కలిసె పసుపు గింజలతోటి
గిన్నెలో కర్పూర తెలుపుతోటి
ఏ చేతికెప్పుడు ఎన్నిముల్లాడతాయో
మనికట్టులో దాగు కనికట్టునడుగు


ఆకాంక్షలన్నీ అక్షింతలవుతుంటే
ఆనంద సమయాల కన్నీళ్ళ నడుగు

కర్పూరమెందుకని కన్నీళ్లు రాల్చిందో
కాళ్ళనే తాకేటి చేతినడుగు

రంగుల హరివిల్లు తానమాడిన యట్టి
ముడివేయు బందాల దారాలలోన
మణిపూస మాటల్లో మనుసులున్నారని
మెల్లగా పున్నమితో సెప్పి చూడు

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు