నిజమైతే మరీ బాగున్ను


బరువెక్కిన గుండెనుండి బాధని తీసేసి
బయటపడేసే దుఃఖంలా,
శ్రమఫలితం సుఖమైననిద్రని
చెమ్మైన ఒల్లుకు చెబుతున్న చెమట చుక్కల్లా , ఆకాశం ఆనందంతో నవ్వుతూంటే
ఆనందభాష్పాలు రాలినట్టూ కురవాలొక మేఘం.

వానకురిస్తే బడికెల్లని రోజు వీదిచివర మాయమైన ఐస్ బండోడి కోసం
చిన్నపుడు గుమ్మాలో దొర్లేడ్చిన జ్ఞ్యాపకం
దుక్కిదున్ని పొడినేలమీద పడ్డ రైతొకడు గుర్తుచేస్తాడు

మార్పు అంటే ఏంటని మానాన్నడిగితే వానాకాలం ఎండలాటి వెటకారపు నవ్వు..

కనీసం అది సూసైనా ఈ ఏడు వాన కురిస్తే బాగున్ను . తానానికి రేవుకొస్తానని రాజాగాడి ఎదురుసూపు నిజమైతే మరీ బాగున్ను.

04/07/2014

వ్యాఖ్యలు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ప్రముఖ పోస్ట్‌లు