వాట్స్ ఆన్ యువర్ మైండ్

ఎప్పుడూ వాట్స్ ఆన్ యువర్ మైండ్ అంటే ఏం చెప్పనూ!

పొద్దున్నే వాకింకెళ్లినపుడు ఆ లాస్ట్ కి పోతే స్కై కిందకొస్తదనీ
మా డాడీ దాన్ని బైక్ మీద పట్టుకొస్తాడనీ అనే పిల్లాల్లోన్ని అమాయకత్వాన్ని
పోన్ లో టైమ్ చూసుకుంటూ దాటిపోవాలి.

వొంగూని పైకిలేస్తూ నడుం సరిచేసుకుని పక్కనే రాలిన తురాయిపువ్వును చూసి
తుంటరి పనులెన్నో తోడుతెచ్చుకోవాలి.

వదులైన లేస్ బిగిస్తే పడిన ఆ హడావుడి ముడిని విప్పుతూ, ఆ పక్కన గడ్డిమీద కాళ్ళు చాపుకుని నవ్వుతున్న ముసలాన్ని ఎలా విష్ చెయ్యాలో తెలీక నవ్వు మాత్రమే వచ్చుద్ది నాకు

వాట్స్ ఆన్ యువర్ మైండ్ అన్నట్టు ఎవరైనా చూస్తే
స్మైల్ ఫరెవర్ అన్న సమాదానం నా అంతట నేనిచ్చింది కాదు.

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు