దారి


ఒక పచ్చాత్తాపం పలకరింపుల్ని కోరుతున్నాక

మొహమాటాలు దారితప్పిస్తాయ్


ఇదంతా తెలీనిదా ఏంటి ?


నాకు నువ్వు, నీకు నేనూ కాదుగానీ దారులే ఒకదానికొకటి ఎదురవుతాయ్

వాటిలోనుండి తప్పుకోలేక, తలలెత్తి చూడనూలేక తప్పున్నవాడు కుదించుకుపోతాడు

మిగతావాడు చూస్తావని ఆశగా ఉన్నా ఎదురుపడ్డందుకో, ఎలా ఉన్నావని అడుగుతున్నందుకో

చూసీ చూడనట్టు తప్పుకుంటున్నందుకో నవ్వాలి మరి.


మాటల్లేని దారులన్నీ మనుసుల్లేని దారులకంటే నిర్మానుష్యంగా ఉంటాయని తెలిసీ ఇద్దరు కలిసిపోయాక

నవ్వులు శాస్వతం కావాలి. క్షమించడాలు ప్రేమించడం కిందకి వచ్చేయాలి

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు