పాత మొలతాడు


happy fathers day


మెట్టు దిగేటపుడు తూలే నా అడుక్కి తోడైన చేతుల్ని
ఇంకా పట్టుకూనే ఉన్నా !
అందని సైకిల్ ఎక్కుతున్నపుడూ, ఫెడల్ జారి పడిపోయినపుడూ
కొట్టుకుపోయిన చేతుల్ని , ఆ చేతికంటిన మట్టిని ఇంకా గుర్తు పెట్టుకునే ఉన్నా

బోడి మొలమీద బొందులాగూని ఎక్కించి కట్టిన చేతిని
పదో తరగతి పాసైనపుడు తాయిత్తు చేతికి
వాచీ పెట్టిన చేతినీ మొన్నీమధ్యే ముద్దెట్టుకున్నా!

పాతికేళ్ళకు ఇంకా పాత మొలతాడే ఎందుకుందో తెలుస్తున్నాక
ఒకడి చేతులెపుడూ అద్భుతాల్ని చేస్తాయని అనిపిస్తున్నాక

ఆశానికి ఎత్తుకుని అరికాలు ముద్దెట్టుకునే మా నాన గుర్తొస్తాడు

వ్యాఖ్యలు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ప్రముఖ పోస్ట్‌లు