||మందార పువ్వు ||కురిసిన వానంతా దూళి ప్రాణాలు తీసేసినట్టు
ఇంతిలా తడిపి చంపడం బాగుంది

ఇష్టం తెలపక పోయినా ఏడుస్తుంటే, నచ్చావని చెప్పబుద్దై
మౌనంగా ఉన్న మూలాన,
అప్పుడప్పుడూ తడవడం అలవాటయ్యింది నాకు

నవ్వుతూంది, ఏడుస్తుంది సరే!
ఏదన్నా చెప్పాల్సొస్తే అమ్మలాగే
అచ్చం అమ్మలాగే చెంగుచివర్లు మెలితిప్పి తలదించుకుంది
నాన్నా కాస్త లేటైనా
నాకూ ఓ మందారపువ్వు తెచ్చివ్వు.

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు