||వొంగపువ్వు||వేలితో సబ్బుబిళ్ళరగదీసి

అద్దాన్నొక సారీ, నాననొకసారి సూసాక

నువ్వెట్టుకున్న కాస్త కుంకుంబొట్టూ నీ నొసటమీద ఉదయించిన సూరీడు.

నాన లెగిసినా, నేను లెగిసినా

కనపడే నీమొకమే మా తూరుపుదిక్కు .నువ్వు మెడ తడుముకున్నాక కల్లద్దుకున్న పసుబ్బొందు

నానతో ఏమ్మాటాడుద్ది?

నవ్వే నిన్ను చూసి మానాన ఒయ్యారంగా తెంపిన వొంగపువ్వు

నీ సిగనున్నాక

అమ్మా అందమంటే నీదే కదూ !
Comments

 1. kavita raaste...ilaa vundaaali.. andariki ardham ayyelaaaa.. inkaa chadive koddiiii.. enta lotugaa bhavam vundaalo ani..

  Kasi Raju, you should publish this as a book. Please start interacting with writer community..you will have poetry clubs in cities.. you should enroll yourself.

  ReplyDelete
  Replies
  1. సరేనండీ సరయూ గారూ !

   Delete
 2. నువ్వు మెడ తడుముకున్నాక కల్లద్దుకున్న పసుబ్బొందు

  నానతో ఏమ్మాటాడుద్ది?

  ఎంత అందమైన అనిర్వచనీయ భావమో
  బాగుంది
  అభినందనలు కాశిరాజు! సుప్రభాతం!!

  ReplyDelete
  Replies
  1. సుప్రభాతం గురూజీ

   Delete

Post a Comment

Popular posts from this blog

కనీసం

F1.

షేరాటో