||గురుతు||వచ్చి పోవడం తెలిసింది
ఒక నువ్వు లేవు అనిపించాక

మొన్నీమద్యే అమ్మన్నది
నువ్వు పుట్టి పెరిగేసావ్ రా ని

నా వైపు నేను చూసుకుంటే
ఒక్కటే గురుతు
చిన్నప్పుడు బోడిఒల్లుతో చతికిలబడి
అంటించుకున్న గుమ్మం ముగ్గు
ఇప్పుడూ నా రైమాండ్ ప్యాంటుకు అంటుకుంది.

అమ్మని నాన్న గొంతుతో ఓమాటడిగాను
నేను ఎదగలేదా? అని

అమ్మ నవ్వుతానే
నాన్ని సూపించి "ఎదిగావ్ నీ సొక్కా నాన్నేసుకునేంత" అనేసింది
అదేమాట నువ్వు అన్నావని గుర్తొచ్చి
అమ్మతో ఈ మాటన్నాను
కృష్ణవేణి పండక్కి ఇంటికొత్తాదా అని

అమ్మ కూడా అలాగే సూసి
అచ్చం నీలాగే ముద్దెట్టుకుని

మనుషుల్ని మనసులో దాసేసి
కాలానికి వచ్చి పోవడం తెలుసు అనేసింది.

నాన్నేమో నా కళ్ళ నీళ్ళలో
కోడలి పిల్లని వెతుకుతున్నాడు

(మొన్న పండక్కి కృష్ణవేణి కి మేమందరం శుభాకాంక్షలు చెప్పాం )
21/01/2014

Comments

Popular posts from this blog

కనీసం

F1.

షేరాటో