||ప్రేయసీ-13||

కొద్ది సేపైనా కూర్చోవడం తెలియాలి
గుట్టమీదో , గుడి మెట్టుమీదో
గుండెకు కాస్త దగ్గరిగానో

ఒకరి వైపొకరు
ఏం కోరి చూస్తారో ఏమాత్రమూ తెలీక
మాటల్ని కోల్పోవడమే మన పనైపోవాలి

బందాలు నిలబడాలంటే
బలహీనతేదో మనల్ని కట్టి ఉంచేయాలి

ప్రేయసీ
కాలానికి కలిసి కూర్చోవడం నేర్పేసాక

గుండెల్ని గుట్టుగా దాచేసుకోవాలి

వ్యాఖ్యలు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ప్రముఖ పోస్ట్‌లు