||ప్రేయసీ-12||

అనగనగా ఒకనాడు

వాడు పరిపూర్ణుడవ్వాలని

ఒకే ఒక కోరికతో కళ్ళు కాయలు కాచేలా

ఒళ్ళుకోసం ఎదురు చూస్తాడు


ఒసేయ్ అని పిలవగానే

ఓడించే పని పెట్టుకుని

ఒళ్ళంతా ఒక వర్ణపటమై

ఒక్కో రంగునూ ప్రసరింపజేస్తావు

కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతిలో ఒకడు కరిగిపోతూ

ఉనికిని కోల్పోయి కాళ్ళ దగ్గరే పడుంటానంటాడు.

అదిగో అప్పుడు చాల్లెద్దూ అన్న చూపుతో

తమకంలోనుండి బయటకు తన్నేసి

మళ్ళీ బతిమాలించుకుంటావు.


గడ్డం నుంచి కాళ్ళదాకా ఒక్కో దాన్నీ తడుముతూ

ఆ ఒక్కరాత్రికే ఓడిపోతూ

ఆ ఓటమి వేడుక చేస్తుండగా

బ్రతికే ఉన్నానని ఒకడు భ్రమిస్తాడుప్రేయసీ

అచ్చంగా అలాంటోడికి ఆడదానిలా కనిపింఛి

చీకటిలోకానికి కాంతిపుంజం నువ్వేనని చెప్పు

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు