పోస్ట్‌లు

January, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

||ప్రేయసీ-16||

పరిణామ క్రమం బాగుంది

తడబడి పొరపడిపోయాక
జగమంతా సగమైనట్టు తోచింది
మోహం మొత్తాన్నీ మూటగట్టి
ఒళ్ళు విరుచుకునిమరీ విసిరేయాలిప్పుడు

అదుపుతప్పిన ఎదని తిన్నగా నెట్టేసి

ప్రేయసీ
ప్రేమని ఉన్నాక
పరిస్థితుల ప్రభావం ఉందనే చెప్పాలి

||ప్రేయసీ-17||

ఊకొట్టడం ఊరుకోబెట్టడం తెలిసిందివిన్నాననే రుజువుకు ఒక్క నవ్వో , కనురెప్ప కదలడమో కావాలి మరి

నువ్వూ నాలానే అనుకున్న తర్వాత

వెటకారానికి అసలు బదులు నవ్వేనని తెలిసి

నేనడిగింది నువ్వివ్వనపుడు,నేను రానినవ్వు తెచ్చుకోవాలి


చిన్నబుచ్చడం ప్రేమలకు తెలీదని


ప్రేయసీ

నువ్వేదన్నా చెబుతుంటే ఒళ్ళో తలపెట్టి కళ్లలోకి చూడాలి.

||ప్రేయసీ-13||

కొద్ది సేపైనా కూర్చోవడం తెలియాలి
గుట్టమీదో , గుడి మెట్టుమీదో
గుండెకు కాస్త దగ్గరిగానో

ఒకరి వైపొకరు
ఏం కోరి చూస్తారో ఏమాత్రమూ తెలీక
మాటల్ని కోల్పోవడమే మన పనైపోవాలి

బందాలు నిలబడాలంటే
బలహీనతేదో మనల్ని కట్టి ఉంచేయాలి

ప్రేయసీ
కాలానికి కలిసి కూర్చోవడం నేర్పేసాక

గుండెల్ని గుట్టుగా దాచేసుకోవాలి

||ప్రేయసీ -15||

చదివిన పాఠం చెరిగిపోనంటుంది

బుర్రబద్దలవుతున్నప్పుడు
భౌతిక శాస్త్రంలోకి , రసాయన శాస్త్రం జరిగి
అయస్కాంత క్షేత్రం ముందే తిరుగుతుంటే
దాని దేహమ్మీద నార్త్ పోల్ నుండి
సౌత్ పోల్ కి నడిచే వెళ్ళాలి
ఆకర్షణెప్పుడో వికర్షణణెప్పుడో
అందరికీ తెలుసుగనక

నేర్చిన పాఠం
నాకు నువ్వూ , నీకు నేను అప్పజెప్పాలి

ప్రేయసీ
అప్పజెప్పడం అలవాటైతే
ఆఖరికి ప్రాణం మాత్రమే మిగలాలి

25/01/2014

||ప్రేయసీ-14||

కురిసిన వానకబురు బానే ఉంది

మేఘాలనుండేమో గానీ
కురులలో పురుడేసుకుని
కుంకుమ బొట్టును తాకుతూవచ్చి
ముక్కుపై నుండి ముక్కమ్మీదకి కారే చినుకులన్నీ
మరీ అందంగా ఉంటాయ్.

వాన వెలిశాక నీరు ప్రవహించినట్టు

ప్రేయసీ
దేహమ్మీంచి దిగగానే
కొత్త నీరు కల్లలో కొచ్చేయాలి

కృతజ్ఞత చెప్పడం తెలిసిపోవాలి

||దృవ్ తార ||

బయాన్ని బయటపారేద్దాం

నువ్వోచ్చేయ్ నువ్వోచ్చేయ్

బయం పారేద్దామ్ తసీ అని నువ్వన్నపుడల్లా

నీ గుండెమీద గుప్పెట పెట్టి బయాన్ని బయటకు తీసి

మట్టి చేలలోనూ , కొండ గుట్టలోనూ

బాల్యాన్ని కోల్పోయిన బయాన్ని నేను తీసుకున్నానుఒకరోజు కలిసి మనం ఒక్కరమైపొయాక

ఒరేయ్ నాకు బయమేస్తుంది

ద్రువ్ గాడు పక్కన లేడని

నేను నిద్రున్నపుడు

నాతోటీ, నా డైరీ తోటీ ఏం చెబుతానో తెలుసా

"మనం పడ్తుందామ్ తసీ" పడ్తుందామ్కాలాన్ని వెనక్కి తిప్పలేమని ఎవరన్నా అన్నాక

తీస్కోచ్చి నిన్ను చూపించాలనుంది.

వాళ్లతోటీ "మనం పడ్తుందామ్ అనిపించాక

వాళ్ళని చిన్నోల్ని చేసి నీ చుట్టూరా వదిలేయాలని ఉంది.

మెడచుట్టూ చెయ్యేసి

తసీ మనం పారిపోదాం అన్నప్పుడు

నన్ను నీకు కట్టేసుకుని

దుప్పట్లోకి దూరిపోయి ధ్రువ తారని వెతికానుఅందుకే లేచే సరికి నువ్వు గుర్తొచ్చిన రోజున

తసీ మనం ఆపీసుకెల్లాలని నేను కేకలేస్తే

నా దోస్తు నన్ను చిన్నపిల్లాడన్నాక

నాకో దృవతార గుర్తొచ్చి కల్లెంబడి నీల్లొస్తాయి

(పిల్లల్తో పిల్లానైపోయి ! ఓ రోజంతా పిల్ల పనులు చేసాక , నాకు ఒకరోజంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేవరకూ అన్నమాట ద్రువ్ గాడికోసం రాసింది కృష్ణ మోహన్ , అపర్ణల కొడుకు )

||గురుతు||

వచ్చి పోవడం తెలిసింది
ఒక నువ్వు లేవు అనిపించాక

మొన్నీమద్యే అమ్మన్నది
నువ్వు పుట్టి పెరిగేసావ్ రా ని

నా వైపు నేను చూసుకుంటే
ఒక్కటే గురుతు
చిన్నప్పుడు బోడిఒల్లుతో చతికిలబడి
అంటించుకున్న గుమ్మం ముగ్గు
ఇప్పుడూ నా రైమాండ్ ప్యాంటుకు అంటుకుంది.

అమ్మని నాన్న గొంతుతో ఓమాటడిగాను
నేను ఎదగలేదా? అని

అమ్మ నవ్వుతానే
నాన్ని సూపించి "ఎదిగావ్ నీ సొక్కా నాన్నేసుకునేంత" అనేసింది
అదేమాట నువ్వు అన్నావని గుర్తొచ్చి
అమ్మతో ఈ మాటన్నాను
కృష్ణవేణి పండక్కి ఇంటికొత్తాదా అని

అమ్మ కూడా అలాగే సూసి
అచ్చం నీలాగే ముద్దెట్టుకుని

మనుషుల్ని మనసులో దాసేసి
కాలానికి వచ్చి పోవడం తెలుసు అనేసింది.

నాన్నేమో నా కళ్ళ నీళ్ళలో
కోడలి పిల్లని వెతుకుతున్నాడు

(మొన్న పండక్కి కృష్ణవేణి కి మేమందరం శుభాకాంక్షలు చెప్పాం )
21/01/2014

||ప్రేయసీ-12||

అనగనగా ఒకనాడు

వాడు పరిపూర్ణుడవ్వాలని

ఒకే ఒక కోరికతో కళ్ళు కాయలు కాచేలా

ఒళ్ళుకోసం ఎదురు చూస్తాడు


ఒసేయ్ అని పిలవగానే

ఓడించే పని పెట్టుకుని

ఒళ్ళంతా ఒక వర్ణపటమై

ఒక్కో రంగునూ ప్రసరింపజేస్తావు

కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతిలో ఒకడు కరిగిపోతూ

ఉనికిని కోల్పోయి కాళ్ళ దగ్గరే పడుంటానంటాడు.

అదిగో అప్పుడు చాల్లెద్దూ అన్న చూపుతో

తమకంలోనుండి బయటకు తన్నేసి

మళ్ళీ బతిమాలించుకుంటావు.


గడ్డం నుంచి కాళ్ళదాకా ఒక్కో దాన్నీ తడుముతూ

ఆ ఒక్కరాత్రికే ఓడిపోతూ

ఆ ఓటమి వేడుక చేస్తుండగా

బ్రతికే ఉన్నానని ఒకడు భ్రమిస్తాడుప్రేయసీ

అచ్చంగా అలాంటోడికి ఆడదానిలా కనిపింఛి

చీకటిలోకానికి కాంతిపుంజం నువ్వేనని చెప్పు