|| ఉయ్యాల||


అట్లతద్దినాడు అన్నిల్లలోనా
ఆనోటా, ఈనాట అందరీనోటా
ఎక్కడెక్కడే ఎంకన్నగాడెకడ
ఎవరన్న చూసారా ఇయ్యాల?

1.చూసానే చూసానే సిన్నమ్మా
నీ ఉయ్యాల నాకంటనియ్యాల
చూసానే చూసానే సిన్నమ్మా
నీ ఉయ్యాల నాకంటనియ్యాల

ఏటిగట్టుకాడ ఉయ్యాలా , ఎలగ చెట్టుకాడ ఉయ్యాలా
ఏలాడుతుందమ్మ ఉయ్యాలో , ఎక్కి కుచ్చుందామా ఉయ్యాలా
నీ ఎంకన్న ఏసిన ఉయ్యాలా
నీ ఎంకన్న ఏసిన ఉయ్యాలా

నీ సరదా సంతకెళ్ళ, నువ్సల్లంగుండా
నేనెక్కడెక్కెదే ఉయ్యాలా ,నేనెక్కడెక్కెదే ఉయ్యాలా
ఎక్కడెక్కడే ఎంకన్నగాడెకడ
ఎవరన్న చూసారా ఇయ్యాల?

2.చూసానే చూసానే సిన్నమ్మా
నీ ఉయ్యాల నాకంటనియ్యాల
చూసానే చూసానే సిన్నమ్మా
నీ ఉయ్యాల నాకంటనియ్యాల

ఊరిపొలిమేరల్లో ఉయ్యాలా, ఊడలమర్రికీ ఉయ్యాలా
ఊగుతూ ఉండమ్మా ఉయ్యాలో, ఊకొడుతూ జోకొడుతూ ఉయ్యాలా
నీ ఎంకన్న ఏసిన ఉయ్యాలా
నీ ఎంకన్న ఏసిన ఉయ్యాలా

ఊకొట్టేదెక్కడ జోకొట్టేదెక్కడ
ఊరుకోవే నువ్వు ఇయ్యాల, ఎంకన్న జాడేదే ఇయ్యాల
ఎక్కడెక్కడే ఎంకన్నగాడెకడ
ఎవరన్న చూసారా ఇయ్యాల?

3.చూసానే చూసానే సిన్నమ్మా
నీ ఉయ్యాల నాకంటనియ్యాల
చూసానే చూసానే సిన్నమ్మా
నీ ఉయ్యాల నాకంటనియ్యాల

మా ఇంటిలోనా ఉయ్యాలా , మళ్ళీ ఎలిసిందమ్మా ఇయ్యాలా
పాతచీరేగానీ ఉయ్యాలో , పదిలంగా ఉందమ్మా ఉయ్యాలా
నీ ఎంకన్న ఏసిన ఉయ్యాలా
నీ ఎంకన్న ఏసిన ఉయ్యాలా
పదిలంగా ఉండేటి ఉయ్యాల,
నవ్వులెన్నో తెచ్చి ఇయ్యాలా , లోకమంతా నవ్వుతుండాల
ఎక్కడెక్కడే ఎంకన్నగాడెకడ
ఎవరన్న చూసారా ఇయ్యాల?

ఎవరన్న చూసారా ఇయ్యాల?
ఎవరన్న చూసారా ఇయ్యాల?
ఎవరన్న చూసారా ఇయ్యాల?

10-08-2013

వ్యాఖ్యలు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ప్రముఖ పోస్ట్‌లు