||ప్రేయసీ-9||అనేకానేక ఆలోచనలు ఆత్మబ్రమణం చెంది ఆఖరికి ఒక రూపం దాల్చేసరికి
ఆలోచనలన్నీ నిశ్శబ్దం నిండిన రాత్రులైపోతాయి
అపుడు నిన్ను ఒకటే అడగాలని ఉంటుంది
గొంతు చించుకుంటున్న కీచురాళ్ళ రొదలో ఓ చిన్నపాటి మూలుగు వినగలిగినపుడు
చంద్రుడు రాని అర్ధరాత్రి ఎవరు వెలిగించిన దీపమో నీ ముఖం , మాక్కాస్త చెప్పరాదూ
నిశ్శబ్దం గుమిగూడిన నిశీది నిట్టూర్పుల్లో ఎదలో దీపాలు ఎలిగించి పోతూ
అంధకారమందలి రహస్యాలు వెలుగులోకి తెచ్చి , హృదయం లో ఆలోచనలు బయల్పరిచి
ప్రతివాడి మెప్పు పొందే ప్రక్రియా క్రియ ప్రేమని చెబుతూ
మనుషుల్ని గెలిచేందుకు నువ్వు చేసే వశీకరణ వరస బాగుందిలే.
ప్రేయసీ
ప్రేమన్న భావం క్రియే ఐతే
భాషాభాగంలా కాదుగాని , బతుకు భాగంలా వాడుకుందాం దాన్ని .28-08-2013

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు