|| ప్రేయసీ - 8 ||ఏ బతుకులోనైనా కడుపాకలి తీరాక కూడా ,

కన్నాకలి తీరక, ఎంగిలి పడదామని చూస్తే

అంగిలి తడవకుండానే నీపంటికింద పడి నలిగిపోయిన వాళ్ళందర్నీ

నీమది గదిలో సమాది చెయ్యి

నీ చేతులు దండలుచేసి, ఎన్ని మెడల్లో వేసి ఎందర్ని ఉరితీసావు?

ఎక్కడ చూసినా తుంటరి తూనీగైపోయాడు మగాడు

వాడే మళ్ళీ నిన్ను ఎర్రరంగు దీపంముందు ఏదో రోడ్డుపై నిలబెట్టి పోతున్నాడు

ప్రేయసీ

మేనిఛాయ పెంచుతానని మాటిచ్చిన మెరుపులచీరని ప్రేమించిన మాదిరి

మగాన్ని కూడా ప్రేమించు

ఒకరి ప్రేమలోనుండుట ఆదియందు అతడిచ్చిన ఆజ్ఞ
(నిన్న ఎదురైనా సన్నివేశాలు చూసాకా , రాత్రి నిద్రకుముందు యోహాను , కొరందీ, హబక్యూ పత్రికలు చదివాక )

23-08-2013వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు