|| ప్రేయసీ -7||ఆవులింతలు నిద్రమేస్తున్న వేళ అతనొక్కడే కాపరి
నిశ్శబ్దపు కంచె నీచుట్టూ వేసేసి, చిన్న దీపపు చూపైనా సోకకుండా నిన్ను నిశిరాశిని చేస్తాడు
క్రమంగా కాలం మూలుగుతున్న చప్పుడు మరింత పెరిగి కాంతి పుంజాన్ని చూస్తాడతను
అంత నిశిలోనూ వెలుగుతున్న ముఖాన్ని అతనికందకుండా అటూ, ఇటూ తిప్పేస్తావు.
ప్రేయసీ
అడుగులే దారైపోతాయని తెలిసినపుడు
అతను నిన్నే వెంబడిస్తాడు.
ఎంత దాచినా ఏమీ దాగనిచోట
కవిత్వం మనిషి మూడోకన్ను
అచ్చోట నీ దాగుడుమూతలు సాగనపుడు
దొంగ ఎవరన్నదీ ముఖ్యం కాక , బట్ట బయలవ్వడం బాధ్యతే అని కవిత్వం కాస్త రాయనివ్వు .21-08-2013

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు