|| ప్రేయసీ-6||ఉదయం నుండి సాయంత్రానికి , సాయంత్రాల నుండి రాత్రుల్లోకి పరుగెడుతూ
అర్ధరాత్రులు అలుపు తీర్చాలని భారంగా నిను చేరినపుడు
భుజంమ్మీద చెయ్యేసి పెళ్ళాంపాత్ర పోషిస్తూ
కన్నీరు రాని కళ్ళలోనుండి, ఏడుపొచ్చేటట్టు ఎదను ఒంపేస్తావు
ప్రేయసీ
అపుడు వెలితి నింపేది ఒక్కరేనని విశ్వానికి చెప్పేసాక
బంధపు బలము పెరిగినపుడే బతుకుకాలం పెరుగునని
అనులోమానుపాతపు అసలురహస్యం అందరికీ చెప్పాల్సిందెవరూ!

19-08-2013

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు