||ప్రేయసీ-4 ||ఏదో ఒక ఉదయం పూట,ఊది ఊది చల్లార్చిన వేడికాస్తా తాగేసి
అందంగా కనిపించే టీ కప్పును వొదల్లేక వొదల్లేక వెళ్తున్నపుడు
రాత్రిదాకా రోజునంతా లాక్కొచ్చి, మంచంపై చేరిన మరుక్షణం కోసం ఎదురుచూడాలని
మనసు మనసులో ఉండక, మన్మధబాధా భాదితుడై వెళిపోతున్న వాడికి
రాత్రయ్యాక రాజవ్వడం నేర్పుతుంటే
కొంగులాగాలన్న కోరిక మేరకు కొలువై ఉన్న నీ దేవుడికి
ప్రేయసీ
కాస్త ప్రేమించడం నేర్పు
అనంత విశ్వానికీ ఆది గురువు నువ్వే

16-08-2013

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు