|| ప్రేయసీ-2||ఆకలికి మారువేషం ఉంటుందని ఆరాత్రి మనకు తెలిసాక
చీకటిని చెరిపేసి పొద్దు వెతుక్కున్నాం
ఆకలిని హత్యచేసిన ఆ రాత్రి మనిద్దరం హంతకులమే
కోరిక ఏదో కాలుతున్నపుడు , ఇద్దరం వెలగాలని చూస్తే
మైనం నేనూ, వత్తి నీవూ

సమానమని చెప్పుకున్న సంగతులన్నీ గుర్తుండి
నిప్పంటుకున్నది నీకైతే, కరిగిపోయింది నేను
మన పాత్రలు మనం పోషిస్తుంటే, నాటకం నాణ్యమవుతున్నపుడు
ఇది కొవ్వొత్తుల కాలమని కవితనొకటి రాసేద్దాం
ప్రేయసీ రా మరి
ముందు మనలాగ చీకట్లో ఉన్న పాఠకులు ఒక్కరైనా ఉండకపోరు
చీకటి చెరిపేసే ప్రయత్నంగానైనా ఇది చదవకపోరు

13-08-2013

Comments