||ప్రేయసీ - 1||ప్రేయసీ నిన్ను నిలువెల్లా చూడాలని నేను ఎంత వేచానో తెలుసానీకు
చీకటిలాంటి నీ నల్లటి కురులు దాటి,నడిచీ నడిచీ నేను ఒక ఉదయాన్ని చూస్తాను
అపుడు
ఉదయిస్తున్న సూర్యుడేవచ్చి నీ నుదుటిమీద వాలినట్టు ఒక కుంకుమ బొట్టు
దానిని పరికిస్తూ అలాగే ఉండిపోదామనుంటే నా వల్లకాదు, మరేం చేయనూ
నీ మెడపైనుండి మధ్యాహ్నం జారుతుంటే దానిని సాయంత్రందాకా చూడాలని ఉంది.
సాయంకాల సమావేశం సాగుతూ సాగుతూ
అక్కడేరాత్రి నన్ను మళ్ళీ ముంచేస్తుందోనని భయం
ఇదిగో ఇలాగే ఎన్నోరాత్రులు నన్ను నేను తగ్గించుకుని
నిన్ను సరిగా వెతకలేదు. నిలువెల్లా కాదుకదా నీడనైనా చూడలేనేమో
ఆ భయం పోడానికి ధైర్యం సరికాదు ! నువ్వే నన్ను ఆవహించు

Comments

Popular posts from this blog

కనీసం

F1.

షేరాటో