పోస్ట్‌లు

August, 2013లోని పోస్ట్‌లను చూపుతోంది

||ప్రేయసీ-9||

అనేకానేక ఆలోచనలు ఆత్మబ్రమణం చెంది ఆఖరికి ఒక రూపం దాల్చేసరికి
ఆలోచనలన్నీ నిశ్శబ్దం నిండిన రాత్రులైపోతాయి
అపుడు నిన్ను ఒకటే అడగాలని ఉంటుంది
గొంతు చించుకుంటున్న కీచురాళ్ళ రొదలో ఓ చిన్నపాటి మూలుగు వినగలిగినపుడు
చంద్రుడు రాని అర్ధరాత్రి ఎవరు వెలిగించిన దీపమో నీ ముఖం , మాక్కాస్త చెప్పరాదూ
నిశ్శబ్దం గుమిగూడిన నిశీది నిట్టూర్పుల్లో ఎదలో దీపాలు ఎలిగించి పోతూ
అంధకారమందలి రహస్యాలు వెలుగులోకి తెచ్చి , హృదయం లో ఆలోచనలు బయల్పరిచి
ప్రతివాడి మెప్పు పొందే ప్రక్రియా క్రియ ప్రేమని చెబుతూ
మనుషుల్ని గెలిచేందుకు నువ్వు చేసే వశీకరణ వరస బాగుందిలే.
ప్రేయసీ
ప్రేమన్న భావం క్రియే ఐతే
భాషాభాగంలా కాదుగాని , బతుకు భాగంలా వాడుకుందాం దాన్ని .28-08-2013

My asset

God! Give me my childhood back !
Give me my rain, my paper boat.
my dripping body and my sniveling nose back,
give me my ferment-rice, my gob of gur, my tire-wheel,
and my dirt road back,
give me my slate, my slate-pencil, my school and the lap of my mother back.
God! Give me my childhood back!

||ప్రేయసీ-9||

అనేకానేక ఆలోచనలు ఆత్మబ్రమణం చెంది ఆఖరికి ఒక రూపం దాల్చేసరికి
ఆలోచనలన్నీ నిశ్శబ్దం నిండిన రాత్రులైపోతాయి
అపుడు నిన్ను ఒకటే అడగాలని ఉంటుంది
గొంతు చించుకుంటున్న కీచురాళ్ళ రొదలో ఓ చిన్నపాటి మూలుగు వినగలిగినపుడు
చంద్రుడు రాని అర్ధరాత్రి ఎవరు వెలిగించిన దీపమో నీ ముఖం , మాక్కాస్త చెప్పరాదూ
నిశ్శబ్దం గుమిగూడిన నిశీది నిట్టూర్పుల్లో ఎదలో దీపాలు ఎలిగించి పోతూ
అంధకారమందలి రహస్యాలు వెలుగులోకి తెచ్చి , హృదయం లో ఆలోచనలు బయల్పరిచి
ప్రతివాడి మెప్పు పొందే ప్రక్రియా క్రియ ప్రేమని చెబుతూ
మనుషుల్ని గెలిచేందుకు నువ్వు చేసే వశీకరణ వరస బాగుందిలే.
ప్రేయసీ
ప్రేమన్న భావం క్రియే ఐతే
భాషాభాగంలా కాదుగాని , బతుకు భాగంలా వాడుకుందాం దాన్ని .


28-08-2013

|| ప్రేయసీ - 8 ||

ఏ బతుకులోనైనా కడుపాకలి తీరాక కూడా ,

కన్నాకలి తీరక, ఎంగిలి పడదామని చూస్తే

అంగిలి తడవకుండానే నీపంటికింద పడి నలిగిపోయిన వాళ్ళందర్నీ

నీమది గదిలో సమాది చెయ్యి

నీ చేతులు దండలుచేసి, ఎన్ని మెడల్లో వేసి ఎందర్ని ఉరితీసావు?

ఎక్కడ చూసినా తుంటరి తూనీగైపోయాడు మగాడు

వాడే మళ్ళీ నిన్ను ఎర్రరంగు దీపంముందు ఏదో రోడ్డుపై నిలబెట్టి పోతున్నాడు

ప్రేయసీ

మేనిఛాయ పెంచుతానని మాటిచ్చిన మెరుపులచీరని ప్రేమించిన మాదిరి

మగాన్ని కూడా ప్రేమించు

ఒకరి ప్రేమలోనుండుట ఆదియందు అతడిచ్చిన ఆజ్ఞ
(నిన్న ఎదురైనా సన్నివేశాలు చూసాకా , రాత్రి నిద్రకుముందు యోహాను , కొరందీ, హబక్యూ పత్రికలు చదివాక )

23-08-2013|| ప్రేయసీ -7||

ఆవులింతలు నిద్రమేస్తున్న వేళ అతనొక్కడే కాపరి
నిశ్శబ్దపు కంచె నీచుట్టూ వేసేసి, చిన్న దీపపు చూపైనా సోకకుండా నిన్ను నిశిరాశిని చేస్తాడు
క్రమంగా కాలం మూలుగుతున్న చప్పుడు మరింత పెరిగి కాంతి పుంజాన్ని చూస్తాడతను
అంత నిశిలోనూ వెలుగుతున్న ముఖాన్ని అతనికందకుండా అటూ, ఇటూ తిప్పేస్తావు.
ప్రేయసీ
అడుగులే దారైపోతాయని తెలిసినపుడు
అతను నిన్నే వెంబడిస్తాడు.
ఎంత దాచినా ఏమీ దాగనిచోట
కవిత్వం మనిషి మూడోకన్ను
అచ్చోట నీ దాగుడుమూతలు సాగనపుడు
దొంగ ఎవరన్నదీ ముఖ్యం కాక , బట్ట బయలవ్వడం బాధ్యతే అని కవిత్వం కాస్త రాయనివ్వు .21-08-2013

|| ప్రేయసీ-6||

ఉదయం నుండి సాయంత్రానికి , సాయంత్రాల నుండి రాత్రుల్లోకి పరుగెడుతూ
అర్ధరాత్రులు అలుపు తీర్చాలని భారంగా నిను చేరినపుడు
భుజంమ్మీద చెయ్యేసి పెళ్ళాంపాత్ర పోషిస్తూ
కన్నీరు రాని కళ్ళలోనుండి, ఏడుపొచ్చేటట్టు ఎదను ఒంపేస్తావు
ప్రేయసీ
అపుడు వెలితి నింపేది ఒక్కరేనని విశ్వానికి చెప్పేసాక
బంధపు బలము పెరిగినపుడే బతుకుకాలం పెరుగునని
అనులోమానుపాతపు అసలురహస్యం అందరికీ చెప్పాల్సిందెవరూ!

19-08-2013

||ప్రేయసీ -5||

కారణం ఏదైనా కానీ

అపార్ధాలకు ఆజ్యం పోసే పంతాన్ని

మౌనం అంచుల చివర వ్రేలాడదీసి మాటరాకుండా చేద్దాం

ఒక్కోసారి ఓడిపోవడంతో ఒకర్ని గెలిస్తేనే

గెలుపును గుండెలోతుల్లోకి తీసుకుంటాం

ప్రేయసీ

ఓర్పు నేర్పిన పాఠంలో ఒక్కో అక్షరాన్నీ ఒద్దికగా నాతో దిద్దించు

ఎంతనేర్చినా కొంత మిగిలే ఎన్నో అభ్యాసాల అధ్యాయానివి నువ్వు

నీ కారణం చేత నిత్య విద్యార్ధిని నేను

17-08-2013

||ప్రేయసీ-4 ||

ఏదో ఒక ఉదయం పూట,ఊది ఊది చల్లార్చిన వేడికాస్తా తాగేసి
అందంగా కనిపించే టీ కప్పును వొదల్లేక వొదల్లేక వెళ్తున్నపుడు
రాత్రిదాకా రోజునంతా లాక్కొచ్చి, మంచంపై చేరిన మరుక్షణం కోసం ఎదురుచూడాలని
మనసు మనసులో ఉండక, మన్మధబాధా భాదితుడై వెళిపోతున్న వాడికి
రాత్రయ్యాక రాజవ్వడం నేర్పుతుంటే
కొంగులాగాలన్న కోరిక మేరకు కొలువై ఉన్న నీ దేవుడికి
ప్రేయసీ
కాస్త ప్రేమించడం నేర్పు
అనంత విశ్వానికీ ఆది గురువు నువ్వే

16-08-2013

||ప్రేయసీ-3||

మనిద్దరిమధ్య మౌనంలాగ
చాలా మందికి సంభాషించడం తెలుసు
ప్రేయసీ
ఎవరెవరికి ఎదురుపడినా
ఇద్దరిలోనూ కోరికలు గుర్రాలే
రథసారధులు ఎవరవ్వాలో తెలీక, ఎవరికీ వారే నడిచిపోయాం
ఏ వీధి చివరనో మౌనభంగం కలిగాక
ఒక్కసారి వెనుదిరిగి, అదృశ్యమైన క్షణాల్ని అక్కడే వదిలిపోతాం
ఆత్మసమీక్ష చేసుకుంటుంటే ఎవరికివారే విమర్శకులౌతాం
అన్నిచోట్లా ఉన్నా అక్కడక్కడా కనిపిస్తే
నేను మాత్రమే కాదు ప్రతి ప్రాణం ఆరగారగా ఆరాధన చేస్తుంది నీకు
ప్రేయసీ
విశ్వమంతా వ్యాపించు నువ్వు
పాలపుంతల దారుల్లో పరవసాల్ని పంచు

14-08-2013

||ప్రేయసీ - 1||

ప్రేయసీ నిన్ను నిలువెల్లా చూడాలని నేను ఎంత వేచానో తెలుసానీకు
చీకటిలాంటి నీ నల్లటి కురులు దాటి,నడిచీ నడిచీ నేను ఒక ఉదయాన్ని చూస్తాను
అపుడు
ఉదయిస్తున్న సూర్యుడేవచ్చి నీ నుదుటిమీద వాలినట్టు ఒక కుంకుమ బొట్టు
దానిని పరికిస్తూ అలాగే ఉండిపోదామనుంటే నా వల్లకాదు, మరేం చేయనూ
నీ మెడపైనుండి మధ్యాహ్నం జారుతుంటే దానిని సాయంత్రందాకా చూడాలని ఉంది.
సాయంకాల సమావేశం సాగుతూ సాగుతూ
అక్కడేరాత్రి నన్ను మళ్ళీ ముంచేస్తుందోనని భయం
ఇదిగో ఇలాగే ఎన్నోరాత్రులు నన్ను నేను తగ్గించుకుని
నిన్ను సరిగా వెతకలేదు. నిలువెల్లా కాదుకదా నీడనైనా చూడలేనేమో
ఆ భయం పోడానికి ధైర్యం సరికాదు ! నువ్వే నన్ను ఆవహించు

|| ప్రేయసీ-2||

ఆకలికి మారువేషం ఉంటుందని ఆరాత్రి మనకు తెలిసాక
చీకటిని చెరిపేసి పొద్దు వెతుక్కున్నాం
ఆకలిని హత్యచేసిన ఆ రాత్రి మనిద్దరం హంతకులమే
కోరిక ఏదో కాలుతున్నపుడు , ఇద్దరం వెలగాలని చూస్తే
మైనం నేనూ, వత్తి నీవూ

సమానమని చెప్పుకున్న సంగతులన్నీ గుర్తుండి
నిప్పంటుకున్నది నీకైతే, కరిగిపోయింది నేను
మన పాత్రలు మనం పోషిస్తుంటే, నాటకం నాణ్యమవుతున్నపుడు
ఇది కొవ్వొత్తుల కాలమని కవితనొకటి రాసేద్దాం
ప్రేయసీ రా మరి
ముందు మనలాగ చీకట్లో ఉన్న పాఠకులు ఒక్కరైనా ఉండకపోరు
చీకటి చెరిపేసే ప్రయత్నంగానైనా ఇది చదవకపోరు

13-08-2013

|| ఉయ్యాల||

అట్లతద్దినాడు అన్నిల్లలోనా
ఆనోటా, ఈనాట అందరీనోటా
ఎక్కడెక్కడే ఎంకన్నగాడెకడ
ఎవరన్న చూసారా ఇయ్యాల?

1.చూసానే చూసానే సిన్నమ్మా
నీ ఉయ్యాల నాకంటనియ్యాల
చూసానే చూసానే సిన్నమ్మా
నీ ఉయ్యాల నాకంటనియ్యాల

ఏటిగట్టుకాడ ఉయ్యాలా , ఎలగ చెట్టుకాడ ఉయ్యాలా
ఏలాడుతుందమ్మ ఉయ్యాలో , ఎక్కి కుచ్చుందామా ఉయ్యాలా
నీ ఎంకన్న ఏసిన ఉయ్యాలా
నీ ఎంకన్న ఏసిన ఉయ్యాలా

నీ సరదా సంతకెళ్ళ, నువ్సల్లంగుండా
నేనెక్కడెక్కెదే ఉయ్యాలా ,నేనెక్కడెక్కెదే ఉయ్యాలా
ఎక్కడెక్కడే ఎంకన్నగాడెకడ
ఎవరన్న చూసారా ఇయ్యాల?

2.చూసానే చూసానే సిన్నమ్మా
నీ ఉయ్యాల నాకంటనియ్యాల
చూసానే చూసానే సిన్నమ్మా
నీ ఉయ్యాల నాకంటనియ్యాల

ఊరిపొలిమేరల్లో ఉయ్యాలా, ఊడలమర్రికీ ఉయ్యాలా
ఊగుతూ ఉండమ్మా ఉయ్యాలో, ఊకొడుతూ జోకొడుతూ ఉయ్యాలా
నీ ఎంకన్న ఏసిన ఉయ్యాలా
నీ ఎంకన్న ఏసిన ఉయ్యాలా

ఊకొట్టేదెక్కడ జోకొట్టేదెక్కడ
ఊరుకోవే నువ్వు ఇయ్యాల, ఎంకన్న జాడేదే ఇయ్యాల
ఎక్కడెక్కడే ఎంకన్నగాడెకడ
ఎవరన్న చూసారా ఇయ్యాల?

3.చూసానే చూసానే సిన్నమ్మా
నీ ఉయ్యాల నాకంటనియ్యాల
చూసానే చూసానే సిన్నమ్మా
నీ ఉయ్యాల నాకంటనియ్యాల

మా ఇంటిలోనా ఉయ్యాలా , మళ్ళీ ఎలిసిందమ్మా ఇయ్యాలా
పాతచీరేగానీ ఉయ్యాలో , పదిలంగా ఉందమ్మా ఉయ్యాలా
నీ ఎంకన…

॥ రాయడం రాక ॥

ఓఎండాకాలపు మెండి సాయంత్రం
మల్లెలారా ! మీ పొదల మాటున చెరో వైపుకు చేరి చూసుకుంటుంటే
పై ఎద కిందకి జారి , కాళ్ళ దగ్గర పడుద్ది
అపుడు వెలుతుర్లు పల్చగా కరిగిపోతుంటే
వెన్నెల్ని కత్తిరించి ఒంటికి తగిలించుకున్నట్టు ఏమిటా మెరుపు ? అని ఎవరైనా , ఎవరినైనా అడిగే ఉంటారు
అవన్నీ రాస్తాంటే ఎవరూరుకుంటారు

పాలశిల్పం మీద పెదవిమచ్చ తుడిస్తే పోతుందని మభ్య పెట్టి పడ్డ తిప్పలన్నీ తెలిసీ
రెండుకళ్ళలో ఒకే కల మాదిరి, చేసేది కావాలనడం నచ్చేదేదో తెలిసినట్టే ఉండడం పరిపాటి .
మేఘం పట్టిన మనసు చల్లగా మారి వానలా కురిసిపోవాలి. ప్రవాహమై నీలోకి పయనించాలి.
అదిగో
ఆవేళపుడు ఎటులగలదు? ఎద సందేహము?
ఉనికిని ప్రశ్నించే నోటికి , ఊపిరాడని స్థితి ఏంటోనని ఏకవీ అడగడు
కళ్ళు మాత్రమే కాదు, ఒళ్ళంతా చెమ్మ గిల్లిన సందర్భాలు చూసాక
కవులంతా నిశ్శబ్ద కవిత్వం రాయాలని చూస్తారు
06-08-2013