॥ అమృతం కురిసిన రాత్రి ॥


అంతా నిద్రపోతున్న అమృతం కురిసిన రాత్రి అతనికీ, ఆమెకీ, వాళ్ళను గమనిస్తున్న నాకూ నిద్ర లేదు తన శక్తి మేరకు ఓ చిన్న దీపం వాళ్ళకూ నాకూ మధ్య చూపును ప్రసాదిస్తుంది
నులకమంచమ్మీద అతనూ, కాళ్ళకట్టపై ఆమె ఉపశమన చలనాలు అతన్ని ఉక్కిరి బిక్కరి చేస్తాయి
ఆమె కళ్ళు అతని కాళ్ళ దగ్గర కారిపోతాయి అతడు పసరు పూసుకొన్న ప్రవరుడిలా వెలిగిపోతాడు
"ఒసేయ్ శేంతా నువ్వుంటే నాకింకేమీ ఒద్దు.. భాదని ఇట్టే మాయం చేత్తావ్ ! ఏముందే నీ దగ్గర ఆదేవతెంతే నీ ముందు " ఆ దేవుడు అంటుంటాడు .. మేత దొరికిన నిశ్శబ్దాలు ఆవార్త నావైపుకు మోసుకొస్తాయి.
మెల్లిగా జరుక్కొంటూ వెళ్లి నులక మంచం ముందరికాళ్ళవద్ద మఠం వేస్తాను
చెరో చెయ్యీ వచ్చి తలపై వాలుతుంది అసంకల్పితంగా ఆరుకళ్ళు తడుస్తుంటాయి .... ఊరేకన్నీళ్ళను దీపం ప్రదర్శనకు పెడుతుంది.. . మేం ముగ్గురం మహామౌనా్నికి శ్రోతలవుతాం ఆరాత్రి నిశబ్ధప్రేక్షకులమవుతాం గుడ్డిదీపపు దర్శకత్వాన మా నాటకం మొదలైనట్టు మాకు స్పురిస్తున్నపుడు అమృతంతో తడిసిన రాత్రికి తెల్లారకూడదని తెలీదు
ఏం చేస్తాం మేమింకా అలాగే ఉన్నాం. అందరి దృష్టిలో ఆ రాత్రి మేము నిద్రపోయాం . మా పాత్రలు ఆ రాత్రిలాంటి రాత్రులలో ఏప్పటికీ అమరం అని ఇప్పటికీ ఎవరికీ తెలీదు

(అమ్మ శాంతమ్మ, నాన్న సత్యనారాయణలకు )

29-07-2013

వ్యాఖ్యలు

 1. నులక మంచం ముందరికాళ్ళ దగ్గర చతికిలబడతాను.
  చెరో చెయ్యీ వచ్చి తలపై వాలుతుంది
  నాలుగు కళ్ళల్లో నీళ్ళు చూసి, ఆరుకళ్ళు తడుస్తుంటాయి .
  ఆ సంకల్పిత చర్యని, దీపం ప్రదర్శనకు పెడుతుంది .
  మా ముగ్గురిలోని మౌనాలు ప్రేక్షకులౌతాయి..
  చాలా ఆర్థ్రంగా వుంది కాశి రాజు గారు..

  ప్రత్యుత్తరంతొలగించు
 2. తడి తెలిసిన బతుకులు ఆర్ద్రంగానే ఉంటాయి కదా సర్ .
  మీ స్పందనకు ధన్యుణ్ణి

  ప్రత్యుత్తరంతొలగించు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ప్రముఖ పోస్ట్‌లు