॥ ఆకురాలు కాలం ॥
నన్నుచూసి నవ్విన ఆ పలానా రోజు
నేను నీ కోసమో కవిత రాస్తానని నాకెప్పుడూ చెప్పిందిలేదు
ఇపుడు వానపడిన జాడేదిలేదు,
కాని చిగురుటాకులు వణుకుతున్నాయి
అసలు మేఘం చూస్తేనే ఆ చెట్టుమొహం మాడిపోతుంది
కొత్త చిగురు వస్తుందన్న సంతోషాన్ని పక్కనపెట్టి
వానలో వణుకుతూ కూచ్చుందిపుడు!
అందరూ చూసేదీ,వినేదీ
మనదీ అదే ప్రేమా?
వద్దు మరో పేరేదన్నాచెప్పమన్నావ్
అందుకోసమోసాయంత్రాన్ని కాకాపట్టి
కూర్చోవలసొచ్చింది నేను
చర్చించుకున్నాం, సమాధానపడ్డాం
పేరేదీ దొరకక ప్రేమేనని ఊరుకున్నాం
మొత్తానికి మొత్తంగా మనదోబంధమైనపుడు
గుళ్ళూ,గోపురాలు తిరిగేసాం!
రానిపెద్దరికం రాసలీల నిర్వచనాలను రచించేంతగా
మనల్ని వశం చేసుకున్నాక
పెద్దాళ్ళమయ్యామన్న పోజు కొట్టొచ్చినట్టు కనపడుతుంటే
పెద్దవాళ్ళ పేర్లు పిల్లలకి పెడదామనుకున్నాం
భాగోతానికి భరోసా కావాలి కదా అని
భారమైనా సరే దూరంగా ఉన్నాం
అయినా మనల్ని దగ్గర చేయడానికి
మన చెట్లూ,కాలవగట్లూ ఏడాదికోమారు పిలుస్తూవున్నాయ్
ఇక నన్ను నువ్వో , నిన్ను నేనో కోల్పాయిందెప్పుడూ ?
ఇదిగో ఇలాగే అనుకుంటున్నప్పుడు
మళ్ళీ ఓమారు చెట్లూ,కాలవగట్లూ పిలిస్తే వచ్చాను
అవన్నీ ఒక్కసారిగా నన్ను చుట్టిముట్టి
నిన్ను నాకు కనబడకుండా దాచేసాయి
మనదని చెప్పుకున్న ఆ గోదావరి
నిన్ను తనలో కలిపేసుకుందని విన్నాక
దానిపై కోపం రాలేదు సరికదా!
ప్రేమ పెరిగి రెట్టింపయ్యింది
అదిమాత్రం ఏం చేస్తుంది చెప్పు?
నన్ను కూర్చోబెట్టి
చెట్లూ, పిట్టలూ, కాలువగట్లూ బోరుమంటున్నాయి
వెళ్ళి కాస్త ఓదార్చమని
నాపై కలిగిన జాలిని దైర్యంలాగ మార్చి చెప్పింది
ఇపుడు మళ్ళీ వెళ్లి మన చెట్టుదగ్గర కూర్చుంటాను
ముగ్గిన ఆకు రాలిపడితే మామూలే
కాని అక్కడ పచ్చి ఆకులు రాలిపడడం చూడలేను
ఆకురాలడం, పూలు పూయడం అంతా సృష్టి అని చెప్పిన నేను
ఆకురాలు కాలం ఆద్యాత్మికం అని
రాణి నవ్వును తెచ్చుకుని చెట్టును చూస్తూ దు:ఖించలేను
(తులసి కృష్ణవేణి కి )
నన్నుచూసి నవ్విన ఆ పలానా రోజు
ప్రత్యుత్తరంతొలగించునేను నీ కోసమో కవిత రాస్తానని నాకెప్పుడూ చెప్పిందిలేదు చాలు కాశి ఈ రెండు LINES---!!
_/\_
ప్రత్యుత్తరంతొలగించుకాని అక్కడ పచ్చి ఆకులు రాలిపడడం చూడలేను ఎంతో హృద్యంగా వుంది ఇంకా ఆ జ్ఞాపకాలు ఎంత పచ్చిగా వున్నాయో అర్ధం అవుతూ వుంది
తొలగించు