పోస్ట్‌లు

April, 2013లోని పోస్ట్‌లను చూపుతోంది

॥ ఆకురాలు కాలం ॥

చిత్రం
నన్నుచూసి నవ్విన ఆ పలానా రోజు

నేను నీ కోసమో కవిత రాస్తానని నాకెప్పుడూ చెప్పిందిలేదుఇపుడు వానపడిన జాడేదిలేదు,

కాని చిగురుటాకులు వణుకుతున్నాయి

అసలు మేఘం చూస్తేనే ఆ చెట్టుమొహం మాడిపోతుంది

కొత్త చిగురు వస్తుందన్న సంతోషాన్ని పక్కనపెట్టి

వానలో వణుకుతూ కూచ్చుందిపుడు!
అందరూ చూసేదీ,వినేదీ

మనదీ అదే ప్రేమా?

వద్దు మరో పేరేదన్నాచెప్పమన్నావ్

అందుకోసమోసాయంత్రాన్ని కాకాపట్టి

కూర్చోవలసొచ్చింది నేను

చర్చించుకున్నాం, సమాధానపడ్డాం

పేరేదీ దొరకక ప్రేమేనని ఊరుకున్నాంమొత్తానికి మొత్తంగా మనదోబంధమైనపుడు

గుళ్ళూ,గోపురాలు తిరిగేసాం!

రానిపెద్దరికం రాసలీల నిర్వచనాలను రచించేంతగా

మనల్ని వశం చేసుకున్నాక

పెద్దాళ్ళమయ్యామన్న పోజు కొట్టొచ్చినట్టు కనపడుతుంటే

పెద్దవాళ్ళ పేర్లు పిల్లలకి పెడదామనుకున్నాంభాగోతానికి భరోసా కావాలి కదా అని

భారమైనా సరే దూరంగా ఉన్నాం

అయినా మనల్ని దగ్గర చేయడానికి

మన చెట్లూ,కాలవగట్లూ ఏడాదికోమారు పిలుస్తూవున్నాయ్

ఇక నన్ను నువ్వో , నిన్ను నేనో కోల్పాయిందెప్పుడూ ?ఇదిగో ఇలాగే అనుకుంటున్నప్పుడు

మళ్ళీ ఓమారు చెట్లూ,కాలవగట్లూ పిలిస్తే వచ్చాను

అవన్నీ ఒక్కసారిగా నన్ను చుట్టిముట…

||కధ కానిదేదో||

అనగనగా ఓ రోజు
భూమ్మీద పడగానే పొత్తిళ్ళలోపెట్టిన నన్ను
ఓ రెండు చేతులు మరింత పక్కకు లాక్కుని
పెదవులకందించాయట.
ఆ పెదవులేమో పుట్టుకను రిజిస్టర్ చేస్తూ
ముద్దుముద్రను నా నుదుటిపై వేసాయట.

మరోమూడు నెలలకి
ఒళ్లోవున్ననాకు ఓ చెయ్యి ఉగ్గుగిన్ని అందిస్తే
మరో చెయ్యి అల్లర్ని అదుపుచేసిందట
ఆ ఒడేమో ఆకల్ని నింపేస్తూ
సుఖంగా నిద్రపోవడం నాకు నేర్పించిందట.

ఒక సంవత్సరం తరువాత
తప్పటడుగులు వేసే నన్ను
రెండు చేతులు ఆకాశానికి ఎత్తేస్తే
పెదాలు అరికాళ్ళను ముద్దడేవట.
ఆకాశమేమో నేలపైకి దిగొచ్చి
అమ్మ పక్కన నిల్చుని మానాన్నైపోయేదట.

మరో ఐదుసవత్సరాల తర్వాత
అదేచేతులు కొత్తచొక్కాకు పసుపురాసి
అరచేతిలోని అక్షింతల్ని
ఆయువుగా నా తలపై వేసాయట
ఆ అక్షింతలేమో అశ్రువుల్ని తోడుచేసుకుని
అమ్మకాళ్ళపై రాలేవట.

పదోతరగతి పాసైనపుడు
ఓ చెయ్యి నానోరుతీపి చేస్తే
మరో చెయ్యి తాళిబొట్టు తాకట్టుపెట్టి
పైచదువులకు పంపించిందట
ఆ ఆతర్వాత ఎగతాళికి గురైన ఆ తాళిబొట్టు
తొలినీటిబొట్టై నీలకు రాలుతుంటే
దోసిట్లో ఆ ముత్యపు చినుకును పట్టితెచ్చి
నా ముందున్చాడట మా నాన్న.

ఇంకొన్నాళ్ళకు
కధలో విరామం లేదుగాని
కధకి వయసొచ్చిందట
అప్పుడుకూడా అదే చేతులు
అవసరాల గుర్తెరిగి అన్నీ అందిస్తుంటే
క…