||స్త్రీ||
0.
నీవల్లే పుట్టిన నేను
నిన్ను కనాలని ఎదురుచూస్తాను
నువ్వునాకు దారౌతావు
అపుడు నిన్నేనమ్ముకు నడుస్తాను
1.
తప్పటడుగులు సరి చేసి
ఎదిగిపొమ్మని పంపావు
వేరేలా ఉన్న నిన్నుచూసి
తప్పుటడుగులు వేసాక
తప్పనిచెప్పి ఒప్పించావు .తెలుసుకున్నాను
2.
అందమూ , ప్రకృతీ అంటూ తిరుగుతాను
అక్కడకూడా నువ్వుంటావు
ఆశ్వాదించి ఆనందిస్తాను .
3.
నింగి, నేలా ,నీరు ,నిప్పు,గాలీ
పంచభూతాలన్నీ నువ్వే అవుతావు
అపుడు నిన్ను నాకు కావాల్సినంత పంచుకుంటాను
4.
అవసరమైనపుడు శాసనాలు చేసి
తప్పదనుకుంటే నాశనం చేస్తావు
అన్నిటికీ సిద్దమే అని శిరసావహిస్తాను
5.
అమ్మవో,ఆలివో, ప్రియురాలివో
ప్రతిదీ నువ్వే అయినపుడు
నిన్నే ఎక్కువ గౌరవిస్తాను .
6
కోపమో ,బాధో, సంతోసమో
తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరైనపుడు
నాకూ సగం ఇచ్చేయమని నువ్వు అడుగుతుంటే
నాలోసగమైన నిన్ను సరిగా అర్ధం చేసుకుని
నీకోసం గుండె గదిని సగం కాళీ చేస్తాను.
7.
మనుసులో,జంతువులో,మొక్కలో,మట్టో
మొత్తానికి మొత్తం నువ్వే అవుతావ్
అపుడు సృష్టికి నిర్వచనంగా నీ పేరే రాస్తాను.
8.
నువ్వు ప్రకృతి ప్రసాదించిన వరమే అయినపుడు
నిన్ను నా కళ్ళకద్దుకు తీసుకుంటాను
9.
నిన్ను అక్షరంగా చూడాలని
నాలాంటి వాళ్ళు అనుకున్నపుడు
కవితో,కధో రాయాలనుకుంటాను
నన్నడగకుండానే నా మాటల్లో నువ్వొచ్చి కుచ్చున్నాక
అపుడు కవితకీ, కధకీ ప్రాణమైన పధంగా
నిన్నే రాసేస్తాను
స్త్రీ అని నీకో పేరు పెట్టి
మగాన్ని ముఖచిత్రంగా వేసి
బతుకుపుస్తకమిదే ! భద్రపరుచుకొమ్మని
బతిమాలి మరీ ఇచ్చేస్తాను

(ప్రతి స్త్రీ కి ఇది అంకితం )

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు