పోస్ట్‌లు

March, 2013లోని పోస్ట్‌లను చూపుతోంది

నిరంతర ప్రవాహం

చిత్రం
"Artists are the engineers of the human soul" -Stalin అన్న స్టాలిన్ మాటల్ని నేను మళ్ళీ వాడాల్సొస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ప్రముఖ చిత్రకారుడు శ్రీ యస్.వి.రామశాస్త్రి గారి నిరంతర ప్రవాహం కవితా సంపుటి చదువుతుండగా కుంచెపట్టుకుని రంగులద్దుతారని తెలిసిన నాకు , ఆ చిత్రాలకు మాటలు నేర్పించి వాటితో మాట్లాడిస్తారని కూడా తెలిసింది. ఆయన రాసిన కవిత్వంలో అనుభూతులన్నీ చిత్రాలై కనిపిస్తాయి. "Art is the objectification of feeling" అన్నమాటలు మన అనుభవంలొనికి వస్తాయి. ఈయన ప్రవృత్తి చిత్రకళ అవడం వల్ల కాబోలు నిశిత పరిశీలనని మనం పసిగట్టవచ్చు. మంచి సున్నితమైన భావుకత్వం కలిగినవారీయన. అది పుస్తకంలో ప్రతిచోటా ఉంటుంది. ఇంకొక విషయం చెప్పాల్సివుంది, ఈయన కవి, చిత్రకారుడు మాత్రమే కాదు సంగీత అభిమాని కూడా! వాళ్ళది సంగీత కుటుంబమట. వారి తండ్రి దీక్షితులుగారూ, తాతగారు సంకిస తారకంగారూ సంగీత విశిష్టులని తెలియని వారూ లేరు.
నిరంతర ప్రవాహం అన్న శీర్షిక దృష్టిలో పెట్టుకుని మాట్లాడినా, ఇందులో ఉన్న అరవైనాలుగు కవితల గురించి మాట్లాడినా సరే సుకుమారత్వం, కరుణరసం ఒలికించిన తీరుగురించి ఇక్కడ చెప్పాల్సిందే. అందుకుగాను బ…

||తాటాకిల్లు||

అలికిన నేలమీద కుచ్చుంటే   అమ్మ చేతులు అందంగా తాకుతుంటాయి 
బద్దెమంచమ్మీద పడుకున్నప్పుడు  గోడలన్నీ నాన్నలా ప్రశాంతంగా కనిపిస్తాయి  ఆయన ఓపికంతా  ఆ తెల్ల గోడలమీద  పొరలుగా పరుచుకునుంది మరి 
పేడ  కల్లాపి పల్చగా చల్లాక  పచ్చని ఆ వాకిట్లో  గుల్లముగ్గు మెలికల్లో నా కళ్ళు చిక్కుకుని  కాళ్ళను కాసేపు కదలనియ్యవు  ఆ అందం ఆ మట్టికే సొంతం మరి 
శాంతిని అమ్ముతున్నట్టు  తెల్లని ఉప్పు మూటొకటి వెనకాల కట్టుకుని  ఉప్పోడొస్తాడు ఆ ఇంటికి  సోలెడు బియ్యానికి అడ్డెడు ఉప్పేసినా  ఆమె కయ్యానికి దిగకమానదు  కాసింత కొసరేసి కనుమరుగయ్యేవాణ్ని చూస్తే  ఆ బేరసారాల్లో బతుకుసారం తెలిసేది 
తాటాకులకు పట్టిన నల్లని కరుదూపం  మాకు దగ్గోస్తే మందయ్యింది  సూరుకు వేలాడే గుప్పెడు వరికంకులు  చాలా పిచ్చుకల్ని పోషించాయి  
అరుగుమీద సున్నంబొట్లన్నీ  ఆమెలానే  నవ్వుతుంటాయి  పిల్లకాల్లో కట్టి తెచ్చిన ఆ చేపలమాము  బొమ్మిడాయిల  వాసనకు తెగ మురిసిపోయేది 
అప్పుడు ఇప్పుడు అని కాకుండా  మండే ఎండల్లో కూడా  చల్లని సమయాలు ఆ ఇంట్లో కరిగిపోయేవి 
సూర్యుల్లాంటి నాన్నతో  వెన్నెల్లాంటి మా అమ్మ  ఆ ఇంట్లోనే మమ్మల్ని కనీ,పెంచింది
మా ఇళ్లంటే   గోడలూ పై కప్పు మాత్…

||స్త్రీ||

0.
నీవల్లే పుట్టిన నేను
నిన్ను కనాలని ఎదురుచూస్తాను
నువ్వునాకు దారౌతావు
అపుడు నిన్నేనమ్ముకు నడుస్తాను
1.
తప్పటడుగులు సరి చేసి
ఎదిగిపొమ్మని పంపావు
వేరేలా ఉన్న నిన్నుచూసి
తప్పుటడుగులు వేసాక
తప్పనిచెప్పి ఒప్పించావు .తెలుసుకున్నాను
2.
అందమూ , ప్రకృతీ అంటూ తిరుగుతాను
అక్కడకూడా నువ్వుంటావు
ఆశ్వాదించి ఆనందిస్తాను .
3.
నింగి, నేలా ,నీరు ,నిప్పు,గాలీ
పంచభూతాలన్నీ నువ్వే అవుతావు
అపుడు నిన్ను నాకు కావాల్సినంత పంచుకుంటాను
4.
అవసరమైనపుడు శాసనాలు చేసి
తప్పదనుకుంటే నాశనం చేస్తావు
అన్నిటికీ సిద్దమే అని శిరసావహిస్తాను
5.
అమ్మవో,ఆలివో, ప్రియురాలివో
ప్రతిదీ నువ్వే అయినపుడు
నిన్నే ఎక్కువ గౌరవిస్తాను .
6
కోపమో ,బాధో, సంతోసమో
తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరైనపుడు
నాకూ సగం ఇచ్చేయమని నువ్వు అడుగుతుంటే
నాలోసగమైన నిన్ను సరిగా అర్ధం చేసుకుని
నీకోసం గుండె గదిని సగం కాళీ చేస్తాను.
7.
మనుసులో,జంతువులో,మొక్కలో,మట్టో
మొత్తానికి మొత్తం నువ్వే అవుతావ్
అపుడు సృష్టికి నిర్వచనంగా నీ పేరే రాస్తాను.
8.
నువ్వు ప్రకృతి ప్రసాదించిన వరమే అయినపుడు
నిన్ను నా కళ్ళకద్దుకు తీసుకుంటాను
9.
నిన్ను అక్…

సమీక్ష: తెల్లకాగితం

చిత్రం
మహత్తర జీవిత కాంక్షను కలిగించేది సాహిత్యం ఒక్కటే. ఏ కవైనా సాధారణంగా సమాజం, ప్రేమ, మానవ సంబంధాలు, ఉద్యమాలు.. ఇంకా చాలా విషయాల గురించి రాస్తారు. ఇతనూ ఈ పుస్తకంలో అదే చేశాడు; కాకపోతే తను రాయకుండా ఉండలేనితనం నుంచి సులువుగా బయటపడడానికి ఒక మార్గం గా కవిత్వాన్ని ఎన్నుకుని, ఏ పాఠకుడ్నీ చదవకుండా ఉండనీయని కవిత్వం రాశాడు. అది తన మొదటి కవిత “తెల్లకాగితం” తోనే తెలుస్తుంది . “నేను నీసొంతమైనపుడు మన మధ్య అక్షరాల అనుభూతులు మాత్రమే మిగలాలి . కవిత్వం మన అంతరాళాల్లోకి ఇంకి లోకమంతా తెల్లకాగితం అవ్వాలి”.. అంటాడు .
ఈయన దగ్గర సహాయం చేసే గుణం చాలావరకూ ఉంది. . “నేస్తమా “ అన్న కవితలో ఒకచోట వర్ణ వంధ్యత్వపు లోకానికి వర్ణ రహిత సువర్ణదీపాన్ని.. నడి సంద్రపు నౌకలాంటి నీకు సుదూరంగా కనిపించే ద్వీపాన్ని .. అని బతుకుకు నేనొక ఆశనని.. ప్రేమించే గుణాన్ని చెప్పకనే చెబుతాడీయన. అభిమానమనేది కవిత్వం మీదే కాదు , కవి మీద కూడా ఉంటుందనేది మనకందరికీ తెలిసిందే. . ఈయన కూడా ఒకానొక అభిమాన కవి బి.వి.వి. ప్రసాద్ గురించి చెబుతూ “ కవిని చూశాక” అన్న కవితలో సముద్రమోకాదో.. జతకట్టిన సంతోషంలో తేలి, సాటినది తో కలిసి..పారి.. జీవి…

||బాల్యం ఎపిసోడ్ -12||

అమ్మ మూసిన గుప్పిట్లో
నిజంగా భూచోడున్నాడో లేదో నాకు తెలీదు
కాని ఆమె గుప్పిట తెరిస్తే నాబువ్వ వాడు తినేస్తాడు
చందమామ రావే అని
మూడో ముద్దేట్టేటప్పుడు కూడా
వాడు రాలేదు
అక్కడే దాక్కుని నాచేత బువ్వ మొత్తం తినిపించేసాడు
నా కడుపు నిండితే వాడికి నిద్రొస్తుందట
నేను పడుకున్నాక నా బుగ్గ మీద ముద్దెట్టి
నేను లేచి ఏడుస్తుంటే
గుర్రమై నన్ను ఎక్కుంచుకోడానికి
మోకరిల్లి నా ముందునుంచుటాడని మా చెప్పక
వాన్ని చూపించమంటే
ఇదిగో ఈడేనని మానాన్ని చూపెట్టాక
నా బాల్యం నాకు బంఫర్ ఆఫర్