||బాల్యం ఎపిసోడ్ -9||గడ్డిపూలన్నీ కోసి
గుచ్చి నీమెళ్ళో ఏసి
మనిద్దరికీ పెళ్లైంది
నువ్వు అమ్మ , నేను నాన్న
పద మనమోపిల్లాన్ని ఎతుక్కుందాం అని
నీ బుజం పై చెయ్యేసినడిసి
మనగుంపునంతా కేకేసి
బడెనకాల కొబ్బరితోట్లో
పిడకల గూడు చాటున
చెవిలో ఏదో చెప్పుకూనొచ్చి
పదిమంది పిల్లలకి ఉత్తుత్తి పప్పన్నం పెట్టేసాక
పెళ్ళైపోయింది ఇక కొట్లాటే కదా అని
కర్రతీసుకుని నిను కొట్టినపుడు
నీ జిమ్మడిపోనూ అని నన్ను తిట్టి
నిజంగా నువ్వు ఏడ్చే సరికి
బాధపెట్నామే కాదు , పంచుకోవాలని తెలిసిన క్షణంలో
నా బాల్యం నాకు బంఫర్ ఆఫర్

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు