||బాల్యం ఎపిసోడ్ -8||కోటరాజుగారి ఊటబోదులో
ఉచ్చపోద్దామని నుంచున్నపుడు
ఎండినాకుమీద కండచీమొకటి
షికారు చేయడం చూశాక
ఎదురుపుల్ల చూపించి దాన్ని ఎక్కించుకొని
ఎక్కనుంచొచ్చావ్ అని అడుగుతున్నప్పుడు
ఎనకాలనుంచున్న ఎంకన్నమాయ
ఏటిగట్టునుండేనని చెబుతా ఉంటే
ఎగాదిగా చూసి నేన్నవ్వుకున్నప్పుడు
ఎర్రిబాగులోన్నని దీవించిపోయాక
నా బాల్యం నాకు భంఫర్ ఆఫర్ 

                                        11.2.2013

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు