పోస్ట్‌లు

February, 2013లోని పోస్ట్‌లను చూపుతోంది

|| బాల్యం ఎపిసోడ్-11||

దొంగతనం తప్పని తెలిసీ
అమాయకత్వంతో దొంగిలించి
పల్నాటోల్ల పిల్లకోసం పనసతొనలు పట్టికెల్లాలని
పట్టుబడకుండా పరిగెడుతుంటే
గొప్పుతగిలి గోరుపగిల్తే
పరుగాపి పక్కకు తీస్కెళ్ళి
కట్టుకట్టి కూర్చోబెట్టాక
నా కంట్లోనీలు నీ కంట్లోనుంచి రానాంచూసి
ఓదారుస్తుంటే బాధమరిచాక
నా బాల్యం నాకు బంపర్ ఆఫర్

||బాల్యం ఎపిసోడ్ -10||

బురుకులాట ఆడుతుండగా
సరుకులైపోయాయని సెప్పినపుడు
సంతకెల్లొస్తానుండని
మీ ఇంటిచుట్టూ తిరిగొస్తే
చింతపండు తేలేదని గొడవసేసి
కూరొండనని నువ్వు అలిగి కూర్చున్నాక
మాఇంట్లో చింతపండు నిజంగా తెచ్చిస్తే
మీ ఇంటికి పట్టుకుపోయి మరలారాలేదు సూడు
పొదుపంటే తెలిపిన ఓ పిసినారిదానా
నీవల్లే కదా
నా బాల్యం నాకు బంపర్ ఆఫర్
                            -కాశి రాజు

||బాల్యం ఎపిసోడ్ -9||

గడ్డిపూలన్నీ కోసి
గుచ్చి నీమెళ్ళో ఏసి
మనిద్దరికీ పెళ్లైంది
నువ్వు అమ్మ , నేను నాన్న
పద మనమోపిల్లాన్ని ఎతుక్కుందాం అని
నీ బుజం పై చెయ్యేసినడిసి
మనగుంపునంతా కేకేసి
బడెనకాల కొబ్బరితోట్లో
పిడకల గూడు చాటున
చెవిలో ఏదో చెప్పుకూనొచ్చి
పదిమంది పిల్లలకి ఉత్తుత్తి పప్పన్నం పెట్టేసాక
పెళ్ళైపోయింది ఇక కొట్లాటే కదా అని
కర్రతీసుకుని నిను కొట్టినపుడు
నీ జిమ్మడిపోనూ అని నన్ను తిట్టి
నిజంగా నువ్వు ఏడ్చే సరికి
బాధపెట్నామే కాదు , పంచుకోవాలని తెలిసిన క్షణంలో
నా బాల్యం నాకు బంఫర్ ఆఫర్

||కవిని చూసాక||

కవిని చూదామని అతని ఊరెళ్ళాను
హాయ్ హలో హౌ ఆర్ యూ డూయింగ్ అని
అంతర్జాల ప్రేమను పంచుకున్నాక
అతనూరికెలాగూ వచ్చాను
కలిచొచ్చేతే ఓ పనైపోద్దని
కవిని చూదామని వెళ్లాను

హలో మీరెక్కడున్నారు?
పడవలరేవుకాడ గుడికాడకొచ్చేయండి
అన్న మృదువైన గొంతును కుదురుగా విని
నేనిక్కడే ఉన్నాను, మీరెక్కడున్నారు ?
అడిగాన్నేను!

సమాదానం చెబుతారేమో అని చూస్తుండగానే
మూడు బీప్ లు వినిపించేసరికి
నా ముందేవున్నాడాయన

కళ్ళు, కళ్ళను చూసుకున్నాయి
పెదాలు ,పెదాలతో మాటాడాయి
మనసు,మనసుతో ముడేసుకుందేమో !
లోలోతున ఉన్న ఉషారొకటి
లోపలే ఉండబట్టలేక ఉరకలేస్తూ
ఉత్సాహమై అరచేతుల్లోకి పరుగున వచ్చేసిందేమో
కరచాలనం కానించేసాం

కాసేపు కుచ్చున్నామో లేదో
ఇంకేంటంటే ఇంకేంటని
ఏమీలేదంటున్న ఎన్నోమాటల్ని
పడవలరేవు గుడిముందు
పంచేసుకున్నాం

చర్చలు సాగుతూనే ఉన్నాయ్
సమయాభావం ఇద్దరికీ!
కానీ
శీతాకాల సమావేశం ముగించాలని లేదు మాకు

ఈ ఒడ్డునుండి ఆ ఒడ్డుకీ
ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకీ
పడవలరేవులో పడవొకటి తిరుగుతున్నట్టు
ఇంకేమిటన్న ప్రశ్నల పడవ మా ఇద్దరిమద్య!

ఎవర్ని కలిసినా ఏదో ఒక గుణంవల్ల
వదల్లేనితనం నన్ను వెల్లనీయదు
మానవత్వం నిండిన మూటను
మనుషులముందు విప్పడానికి
పరిచయాల్ని పట్ట…

సమీక్ష: ఇరువాలు(విడుదల సందర్భంగా)

చిత్రం
కవిత్వం కాపురం  చేస్తున్న ఓ ఇంట్లో ఒక సాయంత్రం పూట ఖాళీగా కూర్చోలేక అల్మారాలు వెతకడం మొదలెట్టాను. పరిచయమైన పుస్తకాలు కొన్ని కనబడ్డా, కొన్నిటిపై చేయివేసి మళ్ళీ వెనక్కి తీసేసుకున్నా! సరిగ్గా ఓ బంగారు రంగు నాగలిబొమ్మ పుస్తకంమ్మీద దున్నుతూ “ఇరువాలు” అన్న శీర్షికతో కనబడేసరికి తీసి చూశాను. అది తెలంగాణా సాహిత్యవ్యాసాలతో కూడిన డాక్టర్ కాసుల లింగారెడ్డి గారి పుస్తకం. నేనాపుస్తకాన్ని ముట్టుకోవడానికి కారణం ఆ శీర్షికే. పుస్తకం మొత్తం చదవడం పూర్తి చేశాక ‘మంచిపుస్తకానికి మంచి శీర్షిక అవసరం’ అనేది భోదపడింది నాకు. ఆ ముఖచిత్రం,శీర్షికలే పుస్తకాన్ని నన్ను చదవమని ప్రేరేపించాయి.
ఇందులో మొత్తం పదిహేడు వ్యాసాలున్నాయి . తెలంగాణా చరిత్రని, ఉద్యమ నేపద్యాన్ని చక్కగా వివరించే వ్యాసాలవి. అన్నీ సాహిత్యంతో సంభందం ఉన్నవే ,కవిత్వం, కధా సంకలనాలకు రాసిన సమీక్ష వ్యాసాలవి. తెలంగాణా ఉద్యమ వ్యాసాలను చాలా చక్కగా రాశారు . అవి ఎన్నికలపైనా,ఉద్యమాలపైనా ఆయనకున్న దృక్పదాన్ని చెబుతాయి. ఇందులో ముక్యంగా మూడు వ్యాసాలున్నాయి. అవి కేవలం తెలంగాణాకు మాత్రమే సంబందించినవి కావు. అవి ఆధునిక వచన కవిత్వంలో వస్తుశిల్పాలు , ఉద్విగ…

||బాల్యం ఎపిసోడ్ -8||

కోటరాజుగారి ఊటబోదులో
ఉచ్చపోద్దామని నుంచున్నపుడు
ఎండినాకుమీద కండచీమొకటి
షికారు చేయడం చూశాక
ఎదురుపుల్ల చూపించి దాన్ని ఎక్కించుకొని
ఎక్కనుంచొచ్చావ్ అని అడుగుతున్నప్పుడు
ఎనకాలనుంచున్న ఎంకన్నమాయ
ఏటిగట్టునుండేనని చెబుతా ఉంటే
ఎగాదిగా చూసి నేన్నవ్వుకున్నప్పుడు
ఎర్రిబాగులోన్నని దీవించిపోయాక
నా బాల్యం నాకు భంఫర్ ఆఫర్ 
                                        11.2.2013

||బాల్యం ఎపిసోడ్ -7||

చెంగున ముడేసిన చిల్లర
చేతిలో పెట్టాక
దంగేటి సాయిబు దుకాణంలో
నాన్నకో పోగాకట్ట కొనితెచ్చి
పట్టెమంచం కోళ్ళ కింద
మిగిలిన రూపాయిని
మూడు రోజులు దాచాక
లచ్చారపుసంతలో పుచ్చకాయ్ ముక్కతో
నా నోరంతా తడిచి, నీ చెంగు చెమ్మయ్యాక
నా బాల్యం నాకు బంఫర్ ఆఫర్
                                                      10.2.2013

సమీక్ష : సమాంతర చాయలు

చిత్రం
సమీక్ష : సమాంతర చాయలు
ఒక భావానుభూతి కవిత్వాన్ని చదివినపుడు నాకు చాలా సంతోషమేసింది, మన భారతీయ సంస్కృతిలో కవికి గొప్ప గౌరవం ఉంది. సాహిత్యంలో ఒక కవి పాటకున్ని శాసిస్తాడు. సమాజాన్ని శాసిస్తాడు. అందుకే కవులు అనధికార శాసనకర్తలు (పి.బి.షెల్లీ ) అన్నారు. ఒక శాసనకర్త ఐదేళ్లు మాత్రమే వుంటాడు. కానీ కవి జీవితకాలం,జీవితానంతరం ఉంటాడు. ఐతే ఇతను శాసనకర్త కూడా అవ్వాలని ఆశించడంలేదు. మనసులోని  మలినాన్ని కడుక్కోవడానికో,లేక ఒక సామాన్య మానవునికి ,సమిష్ఠ మానవునికి మద్య వైరుధ్యాన్ని చెప్పడంకోసమో కవిత్వాన్ని రాసి ఉంటాడు. కవిత్వం రాసే తరుణంలో మనకెంత తెలియనితనముందో తెలుస్తుంది మనకి,ఇతని కవిత్వం చదివాక. ఒక కవికి జారిపోతున్న మొలతాడును బిగించి, దైర్యాన్ని గోరుముద్దలుగా తినిపించి మొనగాడిగా మార్చిన అమ్మమ్మ ఇందులో ఒక కవితై కనిపిస్తూ తన మనువడితో ఈ మాటలనిపిస్తుంది. "అప్పుడే పూస్తున్న బీరపూలు సాక్షిగా బుద్దులూ,సుద్దులూ పోస్తూ స్నానం చేయించిన సంగతి నా శరీరమింకా మరువలేదు " పైవాక్యాల్లో స్నానం చేయించిన సంగతి నా శరీరమింకా మరువలేదు అనడం వెనుక ఒక ప్రత్యేకత ఉంది. నేనింకా మరువలేదనో లేక నా మనసింకా మరువలేదనో రాస్తే అమ్…

||గోదారి గొంతు ||

ఎవడే అమ్మా ఈడు ఎక్కడుంటాడే
ఏరోజుకారోజు ఏదోటి గోలే
రేవుదాటేకాడ కాపుకాస్తుంటాడే
వలవెయ్యబోయి చెయ్యితగిలిస్తాడే
పడవ ఎక్కగానే పనిగట్టుకూని
పక్కన కూచూని తెరఎత్తుతాడే
ఏగాలికేతెర ఎగరేయాలో అని
ఎనకాముందు నన్ను తాకడుగుతాడే
ఎవడే అమ్మా ఈడు ఎక్కడుంటాడే
ఏరోజుకారోజు ఏదోటి గోలే

లెగిసీ లెగ్గానే గుమ్మంముందుటాడే
నేముగ్గేయ్యబొతుంటే మెలితిరుగుతాడే
సేకుసంచితోన సంతకెలుతుంటే
సైకిలేసుకుని సిద్దం గుంటాడే
సంతకెలుతూ నా అంతుసూతానని
మెల్లగా సల్లగా మురిసిపోతాడే
ఎవడే అమ్మా ఈడు ఎక్కడుంటాడే
ఏరోజుకారోజు ఏదోటి గోలే

సందరడేయేల సంతనించొచ్చి
రేవులోకి నేను నీలుకెలతుంటే
కిళ్ళీ కొట్టుకాడ బుల్లీ ఆగే అని
ఎంట వత్తూ నాకంటపడతాడే
రెండు కడవలతో నేనొగుండగానే
ఆడి రెండు కళ్ళూ నా కుండలమీదే
ఎవడే అమ్మా ఈడు ఎక్కడుంటాడే
ఏరోజుకారోజు ఏదోటి గోలే

మెరకచేలోన కలుపుకెలతుంటే
మలుపు తిరిగేకాడ కూచునుంటాడే
ఎందాకోయని ఏమెరగనట్టే
ఏదో ఒకటి నాతో మాటాడుతాడే
చెప్పకూడదని నోరిప్పకుంటే
కుక్కపిల్లలా ఎంటవస్తాడే
ఎవడే అమ్మా ఈడు ఎక్కడుంటాడే
ఏరోజుకారోజు ఏదోటి గోలే
చిత్రం
సమీక్ష: షాడో


మానవ సంభందాలు ఏమవుతునాయి ,ఏ సమాజం ఏ దారిగుండా పోతుంది ?ఎక్కడ చూసినా కృత్రిమత్వం .అంతా గందరగోళంగా అనిపిస్తున్నపుడు ఉద్వేగ భరితమైన ఆలోచనలు కూడా ఒక సంభాషణగా చెబుతూ ఉంటే బండబారాడని కొందరనుకుంటారనీ కృత్రిమత్వం వంటబట్టక కన్నీళ్లు అద్దెకు దొరికితే బాగుండుననుకొనే కవినీ, అతని కవిత్వాన్ని ఈ పుస్తకంలో చూడబోతున్నామంటే అది నిజంగా మన అదృస్టమే !
ఆమె అన్న శీర్షికతో ఒక స్త్రీ ఆంతర్యాన్ని తన నోటితో చెబుతూ
“పచ్చని నోట్లతో ఆమెను పచ్చిగా తాకగలమెమో గానీ
ఈని రాశులు పోసి ఆమె మనసును తాకగళం ?”
రహస్యభరిత జీవన్మరణ క్రీడలో ఆమె ఎప్పుడూ దేహాన్ని విసర్జిస్తూనే ఉంటుంది. ఆమెది కోల్పోవడం అనివార్యంమైన జీవితం .ఆమె పంచుతున్న సుఖానికీ ,ఆమె స్వేదానికీ ,కన్నీళ్ళకీ గురుతుల్లేవ్ అంటాడు .
ఇతనిలోని పరిశీలన,అన్వేషణ తెలుసుకునేందుకు వీలుగా ప్రశ్న లేకుంటే ప్రపంచమెక్కడిదీ,ప్రశ్న ప్రవహిస్తూ ఉంటుంది ఆకలి కడుపులనుండి ,శ్రామికుల చెమటి బొట్టునుండీ ప్రశ్న పురుడుపోసుకుందంటాడు.
తెలుగుకు వెలుగు చూపిస్తున్నాం ఉద్దరిస్తున్నాం అని ఊసులాడుకునే వాళ్ళకోసం ,తెలుగు మీద ఉన్న చూపు చిన్నదవడం వల్ల తెలుగుజాతికి జరిగే నష్టాన్ని నా తెలుగు కవితలో ఇల…