|| తీరంలోని తీపిమాట||


ఉవ్వెత్తునలేచే అలల చాటునో
తడిపొడిగా ఉన్న తీరంలోని ఇసుకలోనో
కొన్ని ఊసులున్నాయ్
అవి ప్రతీ ఏకాంతంతోనూ కొన్ని కబుర్లుచెబుతున్నాయ్

నడిచిన ముద్రపడి
అలలకు చెరిగిపోయే అడుగులు కొన్ని
కధ చెబుతాం కాసేపు కూర్చోమన్నాయ్

ఉరుకుతూ ఉన్న అల ఒకటి
కాళ్ళపైకొచ్చి
తడిస్పర్శను పరిచయం చేసిపోయింది

గవ్వలు కొన్ని నవ్వుతూ కనిపించాయ్
ఒక్కొక్కటీ ఏరి చేతిలో వేసుకుంటే
నవ్వులు పోగేస్తున్నావా అంటూ
వెనకనుండి నీ మాటలినిపించాయ్
ఇకపై సముద్రాన్ని చూసినపుడల్లా నువ్వే గుర్తొస్తావ్ .

14.1.2013f

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు