Skip to main content

మార్పుచూసిన కళ్ళు


                                                
తెలుగు సాహిత్యం గురించి నాకు అంతగా తెలియదుకానీ , హైదారాబాద్ వచ్చాక కొందరు కవులూ,వారి కవిత్వాలు,కధలూ పరిచయం అయ్యాయి .పుస్తకాలు పెద్దగా చదివే అలవాటులేని నాకు పరిచయాలు,వారి పుస్తకాలు తెలుగుభాష మీద ,సాహిత్యం మీద ,పుస్తక పఠనం మీద ఆసక్తిని రేపాయి .ఇంటర్ ఇంజనీరింగ్ చదివే రోజుల్లో కొన్ని పుస్తకాలు చదివినప్పటికీ వాటివల్ల నాకు పెద్దగా ఒరిగిందేమీ లేదు . ఇక్కడికొచ్చాక పుస్తకాన్ని చదివినా నేను పొందిన అనుభూతిని అందరితో  పంచుకోవాలని నేను నా అభిప్రాయాలూ రాయడం మొదలు పెట్టాను.
            జీవిత చరిత్ర ,యాత్రా  విశేషాలు  లాంటివి చదివినపుడు కొన్ని ప్రదేశాలను అందులో ప్రస్తావించడం వల్ల ఆయా ప్రాంతాల ప్రజలగురించి వారి జీవన విదానాల గురించి తెలుసుకునే వీలుంటుంది. పూర్వపు రోజుల్లో ప్రదేశాలు ఎలా ఉండేవో కొన్ని జీవిత చరిత్రల్లో చూడవచ్చు. ఇవన్నీ ఎందుకు రాస్తున్నానంటే మద్య ప్రముఖ పాత్రికేయులు బండారు శ్రీనివాసరావు గారు రాసినమార్పు చూసిన కళ్ళుపుస్తకం  చదివాను. ఆయనతో ఉన్న పరిచయం ఆయనలోని  చతురతను ముందుగానే నాకు బోడపదేటట్టు చేసింది. ఆయన నోరు విప్పినకాడ నవ్వులు రాల్తాయనడం లో అతిశయోక్తి లేదు. చక్కటి సంభాషణ, మంచి హాస్యరచయిత  కూడాను. ఆంధ్రజ్యోతి పత్రికకు సబ్ ఎడిటర్ గా పనిచేసి తరువాత హైదారాబాద్ ఆకాశవాణిలో పనిచేశాకరేడియో మాస్కో లోని న్యూస్ రీడింగ్ ఉద్యోగం కోసం మాస్కో నగరానికి వెళ్ళి అక్కడి పరిస్థితుల్ని జీవన విధానాలని పరిశీలించి ఆయన ఇండియాకు తిరిగివచ్చాక అనుభూతుల్ని అచ్చోసి మనచేతిలో పెట్టారు
           “ఊలిచ్చి వావిలోవా “ – మాస్కో లోని ఒక ప్రాంతం అక్కడే వారి కుటుంబ నివాసం .అక్కడి నిత్యవసర వస్తువులు, మార్కెట్ల  గురించి రాస్తూరీనక్అనే ఒక మార్కెట్ దగ్గర  “ఒకటీ,అరా కానవచ్చే ఆకు కూరల్లో కొన్నింటిని మా ఆవిడశబరిలాగా కొరికి చూసి గోంగూర పులుపుకు కాస్త అటు,ఇటూగా ఉన్న ఆకుకూరను గోంగూర అని నామకరణం చేసింది . తర్వాత మాస్కో లో మేమున్న అయిదేళ్లలో ఇంటికొచ్చిన అతిదులకు  గోంగూరనే ఆతిధ్యంఅని రాశారు.రచయిత భార్య అలా చేయడం అటుంచితే ఈయన రాసిన విదానం ఉంది చూసారూ చదివిన వాళ్ళకి నవ్వు రాకుండా ఉండదంటే నమ్మండి .మాస్కోలో ఉన్న రోజుల్లో పరిస్తితుల్లోనూ కరెంటు గురించి ఇబ్బంది పడలేదుట. అక్కడ ఉన్న అయిదేళ్లలో ఏనాడూ కరెంటు దీపాలు ఒల్టేజీ సమస్యతో ఆయనకు కన్ను కొట్టలేదని రాశారు. పిలవకుండా పలికే డాక్టర్లు,బస్సులో బందువులు ,పాలు ముందా-పెరుగు ముందా ఇలా శీర్షికతో మొదలు పెట్టినా నవ్వించకుండా ఉండరు
            మనవాళ్లు చాలామంది విదేశాలకు వెళ్లారు, వచ్చారు.చాలా బాగుంది అనికూడా రాశారనుకోండీ.కానీ ఈయనంత గొప్పగా రాసింది నేను చూడలేదు. పుస్తకం చదివాక పుస్తకంలోని అక్షరాలైన అనుభూతులు , నడిచి వచ్చిన దారిలో మార్పు చూసిన ఆయన కళ్ళు మనకు కనిపిస్తాయి. మాస్కో నగరం ఏమాత్రం తెలియని వారికి కూడా అంతదాకా వెళ్లొచ్చినట్టు అనిపిస్తుంది . ప్రపంచమే మనముందు ప్రత్యక్షమయ్యేట్టు రాశారు.1987,అంటే సుమారు పాతికేళ్ళ ముందరివి ఇప్పుడు లీలగా గుర్తుంటాయి.వాటిని కూడా ఇంత చక్కగా రాశారంటే ఆయన గొప్పతనాన్ని చెప్పడానికి పనిగట్టుకుని పదం అరువుతెచ్చుకోవాలి నేను .నాకు తెలిసినవి చాలవు మరి.
                                                                                                      -కాశి రాజు(9701075118)

మార్పు చూసిన కళ్ళు (Maarpu choosina kallu)
రచయిత: బండారు శ్రీనివాసరావు (98491 30595)
వెల:110 (50% concessional rate for journalists)
ప్రతులకు: వయోజన పాత్రికేయ సంగం
                ప్లాట్ నెం: 24 , జర్నలిస్ట్స్ కాలనీ
               రోడ్ నెం -3 బంజారాహిల్స్
                హైదారాబాద్ -34 

Comments

Popular posts from this blog

॥ శోభనాలు ॥

మొదలుపెట్టడం నీకూ, నాకూ కొత్తే కదా
నువ్వో నేనో చొరవతీసుకుని ఏదో ఒకటి చేద్దాం
మనకు చెవిలో చెప్పినవి చెప్పినట్టే చేయాలని ఇదివరకే తెలుసు
గడియ సరిగా పెట్టి కిటికీలు మూస్తే సరిపోదు
సర్ధడాలు ఆపేసి పక్కపైకొస్తే త్వరగా లైటార్పేదాం
నీకు తెలుసోలేదో గోడలకు చేవులేకాదు కళ్ళు కూడా ఉంటాయ్
అదిగో చూడు గుడ్లప్పగించి ఎలా చూస్తున్నాయో
వాటి కళ్ళకు గంతలు కట్టలేం గాని.
మనల్ని మనమే దాచేసుకుందాం!
శోభనం అంటే మనలోమనం దాగిపోవడం అని మెల్లమెల్లగా రాసుకుందాం!


పళ్ళూ పాలగ్లాసూ పాతబడిపోయి పక్కనొచ్చి కూర్చున్నాక
కళ్ళలో కళ్ళెట్టి చూస్తే వంద చందమామలు ఉదయించాలి.
అంత మాత్రానికే రాత్రైనట్టు నిర్ధారణకు రావద్దు.
వందచందమామలూ వెన్నెలై కురిసి మనం చల్లగా ఐపోవాలి .
ఒంట్లో వనుకుపుట్టి వేడిసెగ కోసం ఎదురుచూడాలి
వేడి సరిపోక తంటాలు పడుతుంటే ఎలాగోలా తెల్లరిపోవాలి
చెప్పాపెట్టకుండా సూరీడు వచ్చేసాక
చలీ,గిలీ ఏమీ ఉండనపుడు
చక్కిలిగిలి పెట్టుకుని చేరోపక్కకీ మంచం దిగాలి
శోభనం అంటే చలికాచుకోవడం అనే నిర్వచనం రాయాలి


కల్మషం లేకుండా ప్రేమించిన నాడు
ప్రేమించగలిగినవాడు పిల్లాడే అని
ఒల్లోపెట్టుకుని తల్లోచెయ్యేసి నిమురుతుంట…

F1.

కొంత సేపటికి ముందు.
"స్నానానికెళ్లినట్టున్నావ్" ఫోన్ తీసుకోలేదు.

కొంత సేపటి తర్వాత
స్నానం చేస్తూ, నన్ను అర్ధం చేసుకున్నావో, అలవాటు చేసుకున్నావో
ఆలోచిస్తూ
తలపై నుంచి పోసుకున్ననీళ్లలో కలిసి ఇంకా ఇంకా కిందకి జారిపోతాను.
నీ ఒళ్లోకి, అక్కన్నుంచి సగం కలిపి నువ్వొదిలేసిన చద్దన్నం గిన్నెలోకి
అక్కన్నుంచి కొంచెం లేటుగానైనా నువ్వు కొనిచ్చిన ప్రతీ వస్తువులోకి
దూరిపోతాను.

మరికొంత సేపటి తర్వాత
మళ్లీ నీకు ఫోన్ చేసి, "ఇందాక ఏం చెప్పాలో తెలీక ఫోన్ కావాలని తీసుకోలే"దంటాను.
నువ్వేమో తెలుసులే అని కూడా అనవు. నిజంగా నవ్వుతావు
మా చిన్నిప్పుడు నువు చాలా మందికి చెప్పిన "కొంచెం ఇబ్బందుంది ఇంకొక్కరోజాగు" అన్న మాటలా ఇప్పుడు నేను
ఓ ఐదారు నిమిషాలు నిజంగా బతగ్గలిగితే చాలు నాన్నా .

కనీసం

నడుస్తూనో నటిస్తూనో
కొంత మాట్లాడుకుని, వెళ్లిపోతూ నవ్వుకునే ముఖాలమే మనం

ఇంకా కుదిరితే
అనుకుంటున్న ఇష్ట సమాధిలోకి చెరోసగం చేరిపోదాం
ముడివేయబడొద్దని నువ్వో,
ముచ్చటైనా తీరుద్దని నేనో, మళ్ళీ మళ్ళీ కనీసం కలుద్దాం.
ఇంకా కుదిరితే ...
నువ్వు సమస్తమవ్వు, నేను చివరంచుకి నడుస్తా