||బాల్యం ఎపిసోడ్ -6||


పోనంటే పోనని
అమ్మ, అయ్యలకాడ మారం చేసి
గారాభానికి కుసైపోయి
ఒడి నుండి బడిదాకా ఒకటే పరుగు


పీచుమిటాయ్, పిప్పరమెంటు
జాంకాయ ,జొన్నపొత్తు
పంచుకోడంలోని పరమానందం
నాకు మాత్రమే తెలుసనే మహా గర్వం మూట కట్టుకుని
టింగు టింగున గంట మోగ్గానే
చెంగు చెంగున గంతులేస్తూ
బడి నుండి ఒడిదాకా మల్లీపరుగు
తప్పుకూడా ఒప్పులయ్యే నా తెలియని తనంలో
ఒళ్లో వాలగానే చెమ్మయ్యే అమ్మను చూసాక
నా బాల్యం నాకు బంఫర్ ఆఫర్

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు