||బాల్యం ఎపిసోడ్-5||

ఆదివారం పూట ఆట మానేసి
ఇసకలంకలొ ఇటుకబట్టీకాడ
పుచ్చ పువ్వు పూస్తే పట్టుకూనొచ్చి
బేపనయ్యకిస్తే బాగుందన్నాక
కోనేటి మెట్లు దిగి కాళ్ళు కడుక్కుని
శివుడికి చేవ్లో పువ్వెట్టాక
ఏటిగట్టు మీద ఎర్ర సూరీడు
ముత్తేసరం రేవులో మునిగిపోతుండగా
గట్టుకింద గుళ్ళో మైకాసెట్టు
ఎటకారంగా ఏదో పాడుకుంటుంటే
ఎంకడూ,నేనూ ఎగిరి గంతేసామని
మునసూబు తాతొచ్చి ముద్దెట్టుకున్నాక
నా బాల్యం నాకు భంఫర్ ఆఫర్

20.1.2013

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు