||బాల్యం -ఎపిసోడ్4||

పెళ్లిభోజనానికి పిల్లలతో కూచుని
తర్వాత నేనూ ఆరిందానే అని
నాన్నతో నా విందు మళ్ళీ పూర్తి చేసి
అప్పడం,అంటిపండుని
అమ్మకోసం తెచ్చిచ్చి
పప్పుకూడుకోసం పెళ్లి చెయ్యమని
పట్టుబట్టుకుని కూర్చుంటే
చీపురు పుల్లని పిల్లని చేసి
పెళ్లీ శోభనం కలిపిసేశాక
పైనాకిందా తడిపేసుకుని
కూడు మీద అలిగి ,గోడమూలన కూర్చుంటే
గడ్డం పట్టుకుని గోరుముద్దలు పెట్టి
ముద్దుచేస్తున్న నాన గుండెల్ని గుద్ది
నానారబస చేసినపుడు
నా బాల్యం నాకు భంఫర్ ఆఫర్

12.1.2013

Comments