|| బాల్యం-ఎపిసొడ్ 3||

ఒంటరిగా సాగుతున్న పంటకాలవ దగ్గర
మామిడి కొమ్మమీద ముడుచుక్కూచుని
సుర్రుమని చీమిడి పీల్చుతూ
ఏకాంతాన్ని ఎరగా వేసి
ఎట్టకేలకు పట్టుకున్న చేపపిల్లని
గుదిగుచ్చి గుట్టుగా ఇంటికి తెచ్చాక
అది ఒక్కటీ ఒండలేక
పారేయమని పంపినపుడు
పప్పురాముడు తూంకాడ
పండుగాడూ,నేనూ
కుదురుగా కూచుని కాల్చుకుతింటుంటే
అ వెచ్చని పచ్చిచేప ,పడిచచ్చిపోయే ఆ రుచివల్ల
నా బాల్యం నాకు బంఫర్ ఆఫర్

10.1.2013

Comments