||యవ్వనాల ఎపిసోడ్2||


వద్దన్నా వదలని హృదయంలోని
సందేహాలన్నీ తీర్చుకున్నాక
అలసిపోయిన దేహాలకి దాహమేస్తే
తీర్చడం కోసం
ఎండిపోయిన గొంతులతో ఎక్కడెక్కడో వెతికాం
దాహంగా ఉన్న దేహాల్లోని
ఏ భాగమో తగిలి
ఈడుకుండ తొనికాక
తేనె ఒలికితే తాగేసాం
కాని ఆ దాహం తీరిందా
మనం వెతికినప్పుడల్లా
ఆ కుండ తొనుకుతూనే ఉంది
తేనె ఒలుకుతూనే ఉంది
మనం తాగుతూనే వున్నాం
ఆ దాహం తీరడానికి వానేకురవాలి గాని
తేనె సరిపోదు
ఏ వాన ఎప్పుడు కురుస్తుందో అని
ఎండిపోయిన గొంతులతో ఎంతకాలమైనా ఎదురుచూద్దాం
ఏమంటావ్?


26.1.2013

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు