పోస్ట్‌లు

January, 2013లోని పోస్ట్‌లను చూపుతోంది

||బాల్యం ఎపిసోడ్ -6||

పోనంటే పోనని
అమ్మ, అయ్యలకాడ మారం చేసి
గారాభానికి కుసైపోయి
ఒడి నుండి బడిదాకా ఒకటే పరుగు


పీచుమిటాయ్, పిప్పరమెంటు
జాంకాయ ,జొన్నపొత్తు
పంచుకోడంలోని పరమానందం
నాకు మాత్రమే తెలుసనే మహా గర్వం మూట కట్టుకుని
టింగు టింగున గంట మోగ్గానే
చెంగు చెంగున గంతులేస్తూ
బడి నుండి ఒడిదాకా మల్లీపరుగు
తప్పుకూడా ఒప్పులయ్యే నా తెలియని తనంలో
ఒళ్లో వాలగానే చెమ్మయ్యే అమ్మను చూసాక
నా బాల్యం నాకు బంఫర్ ఆఫర్

||యవ్వనాల ఎపిసోడ్2||

వద్దన్నా వదలని హృదయంలోని
సందేహాలన్నీ తీర్చుకున్నాక
అలసిపోయిన దేహాలకి దాహమేస్తే
తీర్చడం కోసం
ఎండిపోయిన గొంతులతో ఎక్కడెక్కడో వెతికాం
దాహంగా ఉన్న దేహాల్లోని
ఏ భాగమో తగిలి
ఈడుకుండ తొనికాక
తేనె ఒలికితే తాగేసాం
కాని ఆ దాహం తీరిందా
మనం వెతికినప్పుడల్లా
ఆ కుండ తొనుకుతూనే ఉంది
తేనె ఒలుకుతూనే ఉంది
మనం తాగుతూనే వున్నాం
ఆ దాహం తీరడానికి వానేకురవాలి గాని
తేనె సరిపోదు
ఏ వాన ఎప్పుడు కురుస్తుందో అని
ఎండిపోయిన గొంతులతో ఎంతకాలమైనా ఎదురుచూద్దాం
ఏమంటావ్?


26.1.2013

||యవ్వనాల ఎపిసోడ్1||

కోరికకి,తపనకి తేడా తెలిసాక
వర్షం వచ్చి వెలిసినట్టు
ఇద్దరిలోనూ ఒక ప్రశాంతత
అది మనలో ఏ ఏ మార్పులు చేసిందోగాని
ఇదివరకటి హృదయాలు కావు మనవి
రెండిటిలోనూ మొక్కలు మొలిచాయ్
అవి మెల్ల మెల్లగా ఎదగాలి
మళ్ళీ వాన కురవాలి
అంతదాకా ఆగుదాంలే
24.01.2013

*లోపలి స్వరం *

చిత్రం
రేణుకా అయోలా లోపలి స్వరం కవితా సంకలనం చదివిన తర్వాత నా అనుభూతిని వీలైతే ఆ రచయిత్రితో లేదా నాలాంటి పాటకులతో పంచుకోవాలనిపించింది.లోపలి స్వరం ఆమె రాసిన రెండవ కవితా సంకలనం.ఇందులో ఉన్న కవితల్లో చాలామటుకు తన రోజువారీ జీవితంలోని సంఘటణలే, వాటిని అక్షరంతో అభిషేకం చేసి మనముందు ప్రతిస్టించింది.ఒకరి మనసులోని ఆంతర్యాన్ని లేదా వారి మాటలను అతి సులువుగా కవిత్వం చేయగలదీమే .
”ఆగిపోని కవిత్వం ఏరులై ప్రవహిస్తుంటే
కవులు పసితనపు పక్షులు ఎగరేస్తారు .
చిట్టి మొలకలవైపు గడ్డి పూలవైపు చూస్తూ సంబరపడిపోతారు.
ఈ కవులు ఏ కాలంలో నడుస్తున్నా,
వారు పాతిన గింజలవంటి చరిత్రను తిరగేస్తూ జీవితం మీద నమ్మకాన్ని కలిగిస్తారు .
ఈ కవులింతే” అని తన తాతగారి మాటల్లోని భావనల్ని ఆయన గొంతై,రాతై మనకు కవితను వినిపిస్తుంది .ఒకరిమీద ప్రేమనో, స్నేహాన్నో , ఒక ప్రదేశం మీద వీడిపోని ఇష్టమో ఆమె కవితల్లో కనిపిస్తాయి.
“జ్ఞాపకాలతో నలుగుతున్న ఆ ముఖం కనపడగానే
ప్రపంచం తెలిసిపోయినంత ఆనందం
దూరం అవుతున్న కొద్దీ
వేదనో, ఆవేదనో తెలియని తనం
ముఖం ముఖంలాగా కాక జ్ఞాపకంలా మనలో మిగులుతుంది “ అని
ఒక చిన్నప్పటి జ్యాపకాన్ని కవిత్వంతో గట్టిగా కట్టి, కానుక మీకు అన్నట్టు మనముందు ఉ…

|| తీరంలోని తీపిమాట||

ఉవ్వెత్తునలేచే అలల చాటునో
తడిపొడిగా ఉన్న తీరంలోని ఇసుకలోనో
కొన్ని ఊసులున్నాయ్
అవి ప్రతీ ఏకాంతంతోనూ కొన్ని కబుర్లుచెబుతున్నాయ్

నడిచిన ముద్రపడి
అలలకు చెరిగిపోయే అడుగులు కొన్ని
కధ చెబుతాం కాసేపు కూర్చోమన్నాయ్

ఉరుకుతూ ఉన్న అల ఒకటి
కాళ్ళపైకొచ్చి
తడిస్పర్శను పరిచయం చేసిపోయింది

గవ్వలు కొన్ని నవ్వుతూ కనిపించాయ్
ఒక్కొక్కటీ ఏరి చేతిలో వేసుకుంటే
నవ్వులు పోగేస్తున్నావా అంటూ
వెనకనుండి నీ మాటలినిపించాయ్
ఇకపై సముద్రాన్ని చూసినపుడల్లా నువ్వే గుర్తొస్తావ్ .

14.1.2013f

||బాల్యం ఎపిసోడ్-5||

ఆదివారం పూట ఆట మానేసి
ఇసకలంకలొ ఇటుకబట్టీకాడ
పుచ్చ పువ్వు పూస్తే పట్టుకూనొచ్చి
బేపనయ్యకిస్తే బాగుందన్నాక
కోనేటి మెట్లు దిగి కాళ్ళు కడుక్కుని
శివుడికి చేవ్లో పువ్వెట్టాక
ఏటిగట్టు మీద ఎర్ర సూరీడు
ముత్తేసరం రేవులో మునిగిపోతుండగా
గట్టుకింద గుళ్ళో మైకాసెట్టు
ఎటకారంగా ఏదో పాడుకుంటుంటే
ఎంకడూ,నేనూ ఎగిరి గంతేసామని
మునసూబు తాతొచ్చి ముద్దెట్టుకున్నాక
నా బాల్యం నాకు భంఫర్ ఆఫర్

20.1.2013

మార్పుచూసిన కళ్ళు

చిత్రం
తెలుగుసాహిత్యంగురించినాకుఅంతగాతెలియదుకానీ, హైదారాబాద్వచ్చాకకొందరుకవులూ,వారికవిత్వాలు,కధలూపరిచయంఅయ్యాయి .పుస్తకాలుపెద్దగాచదివేఅలవాటులేనినాకుఆపరిచయాలు,వారిపుస్తకాలుతెలుగుభాషమీద,