కాశిరాజు || చీకటి సంగతులు||

సందకాడ
గుమ్మం ముందు కుచ్చూని
గుచ్చిన మల్లెలన్నీ
గుసగుసలాడుకుంటాయి
ఆటిదంతాఎదవబుద్ది
"అందర్నీ నలిపేద్దాం" అనే పధకమేసి
అయ్యే నలిగిపోతాయ్ ఆకరికి

తలుపులు మూతడ్డాక
ఒత్తిచిన్నదిచేసి ఎలిగించిన దీపం
చమురు మొత్తం అయిపోయినా
చూసీ చూడనట్టు
తంతుమొత్తం ముగిసేదాకా
ఇంతగా చూద్దామనుకుంటాది

దుప్పట్లో దూరేసారని
దీపం నిట్టూరుత్తుంటే
దుప్పట్లోపడ చీకటేమో
సిగ్గుల్ని చూడలేనన్నట్టు
కల్లకంతలు కట్టుకుంది

కాసేపయ్యాక

ఎనకనుండి
ఎవరో
ఏకాంతంమ్మీద బాణమేసినట్టు
తలుపు చప్పుడు చేత్తారు

"అబ్బా"
అప్పుడే తెల్లారిందా
అనడం అలవాటుగా మారిపోయిన ఆళ్ళిద్దరూ
తెల్లారాక కల్లునులుముకుంటూ
నిద్రపోతూ నడుస్తారు

ఇన్ని సూసి
ఊరికే ఉండడం వల్లకాక
వాళ్ళు ఒద్దన్నా సరే
చీకటి సంగతులని శీర్షికెట్టి
సాటింపేసేత్తాను...............

-కాశి రాజు
Date 09.12.2012

Comments

  1. సాతిమ్పెసీయడం అలవావాటై పోనాది రాజయ్యకి ఏ నాటికైనా బాగుపడతాడంతావేటి!...వండర్ఫుల్ కసిరాజు ..కసంతా చూపిచ్చేసారు.అభినందనలు...నూతక్కి రాఘవేంద్ర రావు.(కనకాంబరం)

    ReplyDelete
  2. Thank you కనకాంబరం gaaru

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కనీసం

F1.

షేరాటో