||ప్రేమలేఖ రాసా నీకంది ఉంటదీ ||


ఓ ప్రేయసీ ప్రేమంటే వయసువేడి ,యాసిడ్ దాడి అనుకుంటున్న ఈ  రోజుల్లో కూడా ప్రేమగురించి చెప్పడానికో  ప్రేమిస్తున్నానని చెప్పడానికో మనసులోని మాటలన్నీ అక్షరాలుగా మార్చి ఒక ఉత్తరం రాయడం కాస్త కష్టమే,ఒక ప్రయోగమే కానీ తప్పడం లేదు!
ప్రేమంటే జీవం, ప్రేమంటే ప్రాణం , ప్రేమంటే దైవం , ప్రేమే జీవితం, ప్రేమే శాశ్వతం అని అందరిలాగానో లేక మరికొందరిలాగానో నేను నిర్వచించలేను గానీ , ఆ నిర్వచనాలకు సరిసమానంగానో లేదా అంతకంటే ఎక్కువగానో నేను ప్రేమిస్తాను కనుక నేనూ ఒక లేఖ రాస్తున్నాను. నిన్ను ప్రేమిచడానికి కూడా కారణం అదీ,ఇదీ అని నా దగ్గర ఏదీ అట్టిపెట్టుకోలేదు తెలుసా! నువ్వు నాలాగ జీవిస్తావానో , లేక నాలాగ అలోచిస్తావనో , నా అంట అందంగా ఉన్నావనో  ఎందుకో ఏమో ఏదో ఒక భావం నిన్ను ప్రేమించేటట్టు చేసింది. ప్రేమను ఇవ్వడం లోని తృప్తి తీరేంతవరకూ  నేను ఇస్తూనే, ప్రేమిస్తూనే ఉంటాను సుమా! 
అన్నట్టు చెప్పడం మరిచిపోయా నేను బతికుండగానే నా ప్రేమను తీసుకో! లేదంటే నేను చచ్చాక కూడా నిన్ను మరువలేను , మన ప్రేమకి ఒక జన్మచాలు మరీ అత్యాసెందుకు మనకి? ఒకజన్మలోనే చాలిందాం మన ప్రేమాయనాన్ని .ఏమంటావ్ ??
నీ జవాబును ఆశించడంలేదు గానీ , ఈ లేఖనీదగ్గర మాత్రమే ఉంచు నేను ఎక్కువమందిని ప్రేమించగలను అనేది ఎవరికీ తెలియనీయకు సుమా 
                                                                                                                          ఇట్లు నీ ప్రియుడు 
                                                                                                                       -కాశిరాజు  రాజు 

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు